అక్కడ క‌రోనా నెగెటివ్ వ‌స్తేనే ఎంట్రీ.. లేదంటే నో ఎంట్రీ!

దేశంలో ప‌లు చోట్ల క‌రోనా సెకెండ్ వేవ్ మొద‌లైంద‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌జ‌లు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండి ఈ మ‌హమ్మారి భారిన ప‌డ‌కుండా చూసుకోవాల‌ని ఇప్ప‌టికే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని రోజుల ముందునుంచి ఢిల్లీ ప్ర‌భుత్వం మాస్క్ లేకుండా భ‌య‌ట‌కు వ‌స్తే రూ. 2 వేల ఫైన్ విధించ‌నున్న‌ట్లు పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ దిశ‌గా ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్పుడు ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది.

రోజురోజుకూ మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ విజృభిస్తోంది. దాంతో ఆ రాష్ట్ర స‌ర్కారు ప‌లు ఆంక్ష‌ల‌ను విధిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, గోవా రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులకు క‌రోనా నెగెటివ్‌ వస్తేనే అనుమతిస్తామని మ‌హారాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించింది. అలా కాకుండా క‌రోనా పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌లో త‌ప్ప‌ని స‌రిగా ఉండాల్సిందేనని పేర్కొంది. అలా క్వారంటైన్ లో ఉండి కోలుకున్నాక త‌ర్వాత మాత్రమే రాష్ట్రంలోకి అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపింది.

క‌రోనా నెగెటివ్ గా ఉంద‌ని తెలుపాల‌నుకుంటే కోవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షల రిపోర్టులను చూపించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. రోజురోజుకు పెరుగుతున్న క‌రోనా కేసుల దృష్ట్యా మ‌ళ్లీ లాక్ డౌవ్ పెట్టే విష‌యాల‌పై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు రెండు వారాల్లో న‌మోదైన కేసులను ప‌రిశీలించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపాడు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ టోపే కూడా రాష్ట్రంలో నెల‌కొంటున్న ప‌రిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ కాక‌పోయినా ప‌లు ఆంక్ష‌లు పెట్టే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు.

అయితే క‌రోనా కేసులు మహారాష్ట్రతోపాటు ప‌లు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌యాణికుల‌పై ఇప్పుడు ఆంక్ష‌లు పెట్టింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌హారాష్ట్ర కు వ‌చ్చే ప్రయాణికులపై ఈ ఆంక్ష‌లు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి త‌ప్ప‌కుండా కరోనా పరీక్షలు చేయించుకోవాల‌ని నిర్ణ‌యించింది.

ఇప్ప‌టి నుంచి మ‌హారాష్ట్రకు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా రాష్ట్రాల నుంచి ప్లైట్, ట్రైన్ ల‌లో వచ్చే ప్ర‌తీ ప్రయాణికుడు ఆర్‌టీపీసీఆర్ టెస్టింగ్ రిపోర్టుల‌ను చూపించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ఆ స‌ద‌రు ప్ర‌యాణికుడికి క‌రోనా నెగిటివ్‌ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అది కూడా 72 గంటల కింద చేయించుకున్న రిపోర్ట్ లై ఉండాల‌ని సూచించారు. దీనికి సంబంధించిన రూల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే జారీ చేసింది. రైళ్లల్లో వ‌చ్చే వారు.. 96 గంటలలోప‌లి రిపోర్టల‌ను చూపించాల్సి ఉంటుంది.