Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో మొదటి వరుసలో ఉండే హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. నందమూరి అభిమానులు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు భారీగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా వస్తుందంటే.. నందమూరి అభిమానులకు సినిమా థియేటర్ లో పూనకాలే అన్న తరహాలో పరిస్థితులు ఉంటవి.
ఎందుకంటే గతంలో భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు కి “సింహా” ద్వారా బ్రేక్ ఇచ్చి ఆ తరువాత “లెజెండ్” సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాడు బోయపాటి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా “అఖండ” పై భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య కెరీర్ చూస్తే.. వరుస ప్లాపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్.. ఆ తర్వాత కొన్ని సినిమాలు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి.. పరాజయాలు మూట కట్టుకోవడం జరిగింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాలయ్య బాబు తో బోయపాటి తీసిన “అఖండ” హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా..పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలావుంటే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సినిమా యూనిట్ రిలీజ్ చేయటం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే అతి తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీ లో 46 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాగా .. త్వరలోనే 50 మిలియన్ వ్యూస్ అతి తక్కువ టైమ్ లో చేసుకోబోయే సినిమాగా అఖండ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. టీజర్ లో బాలయ్య బాబు లుక్ అదరగొట్టే తరహాలో ఉండటంతో .. నందమూరి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. చాలా డిఫరెంట్ గా బాలయ్య బాబుని బోయపాటి చూపించడం తో సినిమా ఏ విధంగా ఉంటుందో స్టోరీ ఏంటో అన్న ఆత్రుతతో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు.