Akhanda : ‘అఖండ’.. నటసింహ నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న సినిమా. మాస్ చిత్రాలతో హిట్స్ ఇస్తున్న బోయపాటి శ్రీను దర్శకుడు. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానుల్లో ఉండే అంచనాలే వేరు. ఇంతక ముందు బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. దాంతో ఇప్పుడు రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ అఖండపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా, అఘోరా గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్స్ భారీ అంచనాలను పెంచాయి.
ఫస్ట్ రిలీజ్ చేసిన టైటిల్ రోర్ తో వచ్చిన హైప్‌ని సెకండ్ టీజర్ మరో లెవల్‌కి తీసుకు వెళ్ళి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టి సెన్షేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ అందుకున్న మొదటి తెలుగు సినిమాగా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం అభిమానుల్లో అలాగే ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బాలయ్య సరసన నటిస్తోంది. సింహా సినిమాలో నయనతార పాత్ర అంత పవర్ ఫుల్‌గా ప్రగ్యా జైస్వాల్ పాత్ర ఉంటుందట.
Akhanda : అఖండ ఫైనల్ షెడ్యూల్లో బాలయ్య జాయిన్ అయ్యాడు.
శ్రీకాంత్ – పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక లెజెండ్ సినిమాలో జగపతి బాబు పోషించిన నెగిటివ్ రోల్ ఇప్పుడు అఖండలో శ్రీకాంత్ పోషించే పాత్ర ఉంటుందట. ఇక సినిమా చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్స్ మీదకి వచ్చిన అఖండ ఫైనల్ షూట్ మొదలైంది. ఈ షెడ్యూల్లో బాలయ్య జాయిన్ అయ్యాడు. అఘోరా పాత్రలో సెట్స్‌లో ప్రత్యక్షమయ్యాడు. మేకర్స్ లేటెస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారకంగా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్న ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే టీజర్స్ కి థమన్ ఇచ్చిన్న ఆర్ ఆర్ అదిరిపోయింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!