Akhil: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. గ్లామర్ పరంగా ఫైట్స్, డాన్స్ పరంగా అంతా బాగున్నా.. అదృష్టం కలిసి రాక ఇంకా ఏదో తెలియదు గానీ.. అఖిల్ ఎప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఈ క్రమంలో స్వయంగా స్టోరీ సెలక్షన్ లో నాగార్జున చొరవ తీసుకున్న గాని.. హిట్ పడట్లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా అఖిల్ చేసినా దానిపై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు అనే టాక్ సోషల్ మీడియా లో నడుస్తుంది.
కారణం బొమ్మరిల్లు భాస్కర్ కి సరైన హిట్ ఈ మధ్యకాలంలో పడలేదు. పైగా ఫామ్ లో కూడా లేడు. మరోపక్క ఇదే టైంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేస్తున్నా “ఏజెంట్” సినిమాకి సంబంధించిన స్టిల్స్.. అఖిల్ ఫోటోలు.. చాలా వైవిధ్యంగా ఉండటం తో సినిమాపై నాకొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. గతంలో సిగరెట్ తాగుతూ.. చాలా స్టైలిష్ గా బైక్ పై.. కూర్చున్న అఖిల్ ఫోటో.. చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో జేమ్స్ బాండ్ మాదిరిగా ఉందని కామెంట్లు పెట్టడం జరిగింది.
Read More: Akhil : పాన్ ఇండియన్ సినిమాగా అఖిల్ ఏజెంట్..?
ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ ఎప్పుడూ లేని విధంగా షర్టు లేకుండా వెనకాల.. బాడీ చూపిస్తూ పోజ్ ఇస్తూ.. వీపు మీద వెరైటీ టాటూ వేయించుకోవడం తో.. స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. దీన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి రిలీజ్ చేసి థిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ ముందు ముందు ఉంది పండుగ.. అంటూ పోస్ట్ చేయడంతో అక్కినేని అభిమానులు సినిమా నెక్స్ట్ లెవెల్ యే అని అంటున్నారు. కచ్చితంగా ఏజెంట్ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడని అంటున్నారు.