Agent: మతిపోగొడుతున్న “ఏజెంట్” ఫస్ట్ లుక్..!! షూటింగ్ షురూ..!!

Share

Agent: అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఏజెంట్.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అని తెలిసినప్పటినుంచి అక్కినేని అభిమానుల్లో ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ మొదలైంది.. ఇప్పటికే ఈ చిత్రం కోసం అఖిల్ బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు..!! అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది..!!

 

Akhil Akkineni Agent: First look out
Akhil Akkineni Agent: First look out

తాజాగా విడుదలైన ఏజెంట్ ఫస్ట్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.. అఖిల్ ఈ సినిమా లో సిక్స్ ప్యాక్ బాడీతో కనువిందు చేయనున్నాడు.. అఖిల్ కెరీర్ లో 5వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇది చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ రాశారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అఖిల్ వర్కౌట్స్ చూస్తుంటే కచ్చితంగా సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అఖిల్ కు ప్లస్ కానుందో చూడాలి.


Share

Related posts

ప్ర‌భాస్ థియేట‌ర్‌ను లాంచ్ చేసిన చెర్రీ

Siva Prasad

బాలకృష్ణ ని బాగా వాడుతున్న హైదరాబాద్ పోలీసులు..!!

sekhar

బండి సంజయ్ దగ్గరకు “క్యూ” కడుతున్న ఆ పార్టీ నేతలు..!!

sekhar