Akhil Akkineni : అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని తన 5వ చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకునేందుకు సిద్దమయ్యాడు.. స్టైలిష్ దర్శకుడు సుందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.. అనిల్ సుంకర నిర్మాతగా ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది.. తాజాగా ఈ రోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా లో అఖిల్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు..
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో ఇద్దరు భారీ సక్సెస్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ చిత్రంలో హీరోయిన్ గా ముంబై కి చెందిన వైద్యా సాక్షి పరిచయం కానుంది.. ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది.. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ చిత్రం పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర యూనిట్ అఖిల్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..