బిగ్ బాస్ 4 : అరియానా కోసం అఖిల్ పై సీరియస్ అయిన అవినాష్..! అమ్మాయి పైన చేయి తీయ్ అనేశాడు

బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ లో లవ్ ట్రాక్ ల హవా కొనసాగుతూనే ఉంది. అయితే అవి కాస్త తారుమారు అవుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో అర్థం కావడం లేదు. సంబంధాలు అన్ని వింతగా మారిపోతున్నాయి. మొదటగా అభిజిత్-మోనాల్ ట్రాక్ నడిచింది అనుకుంటున్నప్పుడు మధ్యలో అఖిల్ వచ్చాడు. ట్రయాంగిల్ కథలు బాగా నడిచిన తర్వాత ఇద్దరిలో అఖిల్ పైచేయి సాధించాడు అని జనాలు ఫిక్స్ అయ్యారు. 

 

అయితే ప్రస్తుతం ఇంటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ ట్రాకులు కాస్త పక్కకు పోతున్నాయి. ఇక అందరిలో అఖిల్, అవినాష్, హారిక, అరియానా, అభిజిత్, మోనాల్ ఫుల్ ఫేమస్ అయిపోయారు. ఈమధ్య అవినాష్-అరియానా జంట బాగా సందడి చేస్తోంది. మొదటినుండి అవినాష్ మోనాల్ ని ట్రై చేస్తున్నట్లు చెబుతుంటాడు. వచ్చిన మొదటి రోజే ఆమెతో పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు .అభిజిత్ దూరం కావడంతో మోనాల్ కొద్దిగా అవినాష్ కి దగ్గరయింది. 

రాత్రిపూట ఇద్దరు కలిసి ఆడుకోవడం, పాడుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. మామూలు అవి నాష్ ఫ్లర్ట్ చేస్తుంటాడు. అందరితో పోలిస్తే అరియానాతో ఇంకాస్త ఎక్కువగా చేస్తుంటాడు. నాగార్జున కూడా వీరిద్దరి లవ్ ట్రాక్ ను బాగానే ప్రోత్సహిస్తున్నాడు. ఇలా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి పోయింది. టాస్క్ ద్వారా కూడా వీరు బాగా దగ్గరయ్యారు. 

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అవినాష్ అఖిల్ కు వార్నింగ్ ఇచ్చాడు. అరియానా మీద అఖిల్ చేయి వేయడంతో.. అఖిల్ చేయి తీసి అంటూ  అవినాష్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అవినాష్ చేయి తీసేందుకు ప్రయత్నించగా అఖిల్ అడ్డు చెప్పాడు. నీకు ఇద్దరు కావాలా మాకు కనీసం ఒక్కరు కూడా లేరు అంటూ చివర్లో సెటైర్ వేశాడు.