బిగ్బాస్ రన్నరప్ అఖిల్ ఈ మధ్య తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలను తాజాగా మీడియాతో వివరిస్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు.
తనకు ఇంత గుర్తింపు రావడానికి పడిన కష్టాలు… అతని మిడిల్ క్లాస్ కుటుంబం పరిస్థితి… ఒక స్టార్ అవ్వాలని అతను కన్న కలలు గురించి వెల్లడించాడు. చిన్నతనంలోనే అతను సెలబ్రిటీ కావాలని కోరుకున్నట్లు అఖిల్ చెప్పాడు. చుట్టూ అందరూ ఉండాలని… మీడియా వెలుగుల మధ్య జీవించాలని అఖిల్ చెప్పడం జరిగింది.
19 ఏళ్ల వయసు నుండి తన పర్సనాలిటీని పెంచుకునేందుకు ప్రయత్నించినట్లు…. వ్యాయామం తో పాటు అందంగా కనిపించేందుకు చికిత్సలు చేసుకున్నట్లు కూడా చెప్పాడు. ఇక ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో తనకు తెలిసిన వ్యక్తి నుండి 50 వేల అప్పు తీసుకుని హైదరాబాద్ కు వెళ్ళినట్లు చెప్పిన అఖిల్ అవకాశాలు వెతుక్కుంటూ అప్పు తీర్చే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు. అలా అప్పులు చేస్తూ వాటిని తీర్చుకుంటూ ముందుకు వెళ్లిన్నట్లు చెప్పాడు.
అదేసమయంలో తనకు చాలా అన్యాయం జరిగినట్లు.. సీరియల్స్ చేస్తున్న యాడ్స్ లో నటించే అవకాశం కూడా లభించినప్పుడు వాటిని అందుకోకుండా కొంతమంది తొక్కేసినట్లు అఖిల్ చెప్పాడు. కొందరు చేసిన పనుల వల్ల బాంబే కంపెనీకి చెందిన అడ్వర్టైజ్మెంట్స్ లో నటించే అవకాశాలు కోల్పోయాను అని చెప్పాడు.
తన ప్రేమ విషయం గురించి చెబుతూ ఒక అమ్మాయి తో ప్రేమలో ఉన్నట్లు చివరికి తమ కులం కాదు అనే విషయం పై నా ప్రేమను తిరస్కరించారు అని… దాంతో ఆ ప్రేమ వ్యవహారానికి బ్రేక్ పడింది అని చెప్పాడు. అయినా ఇక జీవితంలో ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని… తన తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహం అని అఖిల్ వివరించాడు.