బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అఖిల్-మోనాల్ జంట ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్ లో ఈ జంట విపరీతంగా పాపులర్ అయింది. అయితే బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగించడం అంటే గమనించదగ్గ విషయమే. హౌస్ నుండి బయటకు వచ్చాక తర్వాత కూడా వీరిద్దరూ హల్ చల్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట తాజాగా పబ్లిక్ ప్లేస్ లో రెచ్చిపోయి తమ ప్రేమను బయట పెట్టుకున్నారు.
అసలు బిగ్ బాస్ ఇంటిలో మొదట్లో వచ్చినప్పుడు వీరిద్దరిపై పెద్దగా అంచనాలు లేవు. అఖిల్ అనామకుడు మోనాల్ కు ఏమో తెలుగు స్పష్టంగా రాదు కానీ రొమాన్స్ డోస్ పెంచి వీరిద్దరూ ఇంటిలో కొనసాగుతూ వచ్చారు. మధ్య మధ్యలో ముద్దులు కౌగిలింతలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇక తాజాగా అఖిల్, మోనాల్, సోహెల్ హైదరాబాద్ రోడ్లపై రచ్చరచ్చ చేశారు. నైట్ పార్టీ అంటూ వీరిద్దరూ ఒకరికొకరు గులాబీ పూలు ఇచ్చుకొని దిగిన ఫోటోను అఖిల్ షేర్ చేశాడు.
అంతేకాదు… “నన్ను వదిలి పెట్టే ధైర్యం చేయకు” అనే క్యాప్షన్ కూడా పోస్ట్ కింద పెట్టాడు. అఖిల్ పోస్ట్ పై స్పందించిన మోనాల్ “ఛాన్సే లేదు” అంటూ కామెంట్ పెట్టేసింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ మరొకసారి బయటపడినట్లు అయింది. అయితే మోనాల్ తన సొంత ప్రదేశం కాదని హైదరాబాద్ కు అఖిల్ కోసమే షిఫ్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఇక్కడ ఛాన్సులు ఉన్నాయి ఇక్కడే సెటిల్ అయిపోతుందేమో అని అందరూ అనుమానం పడుతున్నారు.
అంతేకాకుండా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా సోహెల్…. అఖిల్ మోనాల్ ని పెళ్లి చేసుకుంటాడు అని నోరు జారాడు. మరి వీరి కథ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం.