9వ వారం బిగ్ బాస్ ఇంటిలో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఓకే ఎపిసోడ్ లో జరగవలసిన నామినేషన్ ప్రక్రియ రెండో ఎపిసోడ్ కు చేరింది. ఇక ఇలా రెండు ఎపిసోడ్లు కొనసాగించడం చూస్తుంటే అక్కడ ఎంత పెద్ద గొడవ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్కరూ తగ్గలేదు. ఒకరిని మించి మరొకరు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. అసలు నామినేషన్ ప్రక్రియ ఇంత వేడిగా కొనసాగుతుందని ఇంటిలో ఎవరూ ఊహించి ఉండరు.
మనుషులు తగ్గుతున్న ప్రతిసారి నామినేషన్ ప్రక్రియ మరింత కఠినతరం అవుతోంది. అన్నిటికన్నా విశేషంగా ఇక్కడ అ మోనాల్, అఖిల్ ల మధ్య కాస్త దూరం పెరిగింది. సోహెల్, నోయల్ తో మాట్లాడే మాటలు మోనాల్ అఖిల్ కు మార్చి చెప్పడం ఆ విషయాన్ని నాగార్జున వీడియో వేసి చూపించడంతో అఖిల్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మోనాల్ గురించి నిజాలు తెలుసుకుని అఖిల్ ఈ వారం ఆమెను నామినేట్ చేశాడు.
కానీ కారణాలు మాత్రం సరిగ్గా చెప్పలేక పోయాడు అని అర్థమవుతుంది. అసలు అఖిల్ మోనాల్ ను నామినేట్ చేయడమేంటి అని ఇంట్లో వారందరికీ పెద్ద షాక్. ఇక రాజశేఖర్ దగ్గరకు ఈ విషయమై వెళ్ళి మోనాల్ కన్నీళ్లు పెట్టుకుంటే అతను ఆమెను మరింత రెచ్చగొట్టాడు. వాడేంటి నిన్ను నామినేట్ చేశాడు అంటూ మరింత రెచ్చగొట్టాడు. ఇవి అతను చెప్పిన కారణాలు సరైనవి కావు…. అసలు కారణం వేరే ఉంది అది ఏంటో నాకు మాత్రమే తెలుసు అని మోనాల్ తన బాధను వెళ్లగక్కింది.
మనుషులను జడ్జ్ చేయడంలో ప్రతిసారి నాదే తప్పు అవుతుంది అని మోనాల్ కంటతడిపెట్టుకోవడం గమనార్హం. ఇక చివరికి ఇంటిలో తను ఒంటరి అయ్యానని అమ్మరాజశేఖర్ కు చెప్పుకుంటూ వాపోయింది. మరొకవైపు అభిజిత్, హారిక, లాస్య కలిసి ఒక గ్యాంగ్ లాగా మారిపోతే అందులో అఖిల్ కూడా చేరిపోయాడు.