ఈ సీజన్ 9వ వారం వారాంతపు ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగి పోతుంది. నాగార్జున ఇంటి సభ్యులందరినీ ఉద్దేశించి చాలా ఘాటుగా మాట్లాడారు. గత వారం ఎలిమినేషన్ కూడా లేకపోయేసరికి ఈ వారం ఇంటిలో పెద్ద రచ్చ చెలరేగింది. అసలు ఎవరు ఎవరిని నామినేట్ చేయబోతున్నారో ఊహించలేని పరిస్థితి.
ఇలాంటి సమయంలోనే అఖిల్ మోనాల్ ను నామినేట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అమ్మ రాజశేఖర్ అభిజిత్, హారిక లతో సహా అందరూ ఆ నామినేషన్ కు ఆశ్చర్యపోయారు. ఇక దీనిపై మోనాల్ స్పందిస్తూ అసలు అఖిల్ తనను నామినేట్ చేస్తాడని కలలో కూడా ఊహించలేదని వాపోయింది. అఖిల్ ను నా ఇంటి సభ్యుడిలా భావించాను అతను నాకు ఫ్యామిలీ తో సమానం…. అటువంటి వ్యక్తి నన్ను నామినేట్ చేయడం నేను తీసుకోలేకపోయారు అని చెప్పింది.
ఇక నాగార్జున అఖిల్ ను ప్రశ్నిస్తూ – “నేను అడుగుతున్నాను సూటిగా చెప్పు…. మోనాల్ నీకు ఫ్రెండ్ మాత్రమేనా అంతకన్నా ఎక్కువా?” అని ప్రశ్నించాడు. ఇక దానికి అఖిల్ కన్ఫ్యూజ్ అయి పోయి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక చాలా తెలివిగా నాగార్జున ముందు మోనాల్ ఏడుపు ఏడుపు మొదలు పెట్టింది కానీ నాగార్జున గతవారం చూపించిన వీడియో కారణంగానే అఖిల్ ఆమెను నామినేట్ చేయవలసి వచ్చింది అని అందరికీ తెలుసు.
ఆ విషయం మాత్రం బయటికి ఎవరు చెప్పకపోవడం ఇక్కడ విశేషం. మోనాల్ ఇలాగే ఇతరుల పై ఆధారపడి కొనసాగితే ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కానీ అఖిల్ కు మాత్రం మోనాల్ ని నామినేట్ చేసిన తర్వాత బయట నుంచి మద్దతు లభిస్తోంది.