బిగ్ బాస్ షో పదవ వారంలో కంటెస్టెంట్ లకు పిచ్చి పడుతోంది. కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసి అందరి ఆశలపై నీళ్లు చల్లిన బిగ్బాస్ అఖిల్ ను సీక్రెట్ రూమ్ కి పంపించాడు. అయితే కంటెస్టెంట్ల దృష్టిలో మాత్రం అఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక దానికి సంబంధించిన సభ్యులందరి వద్ద ఒక క్లారిటీ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రేక్షకులు మాత్రం అఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉండటంతో మరింత ఆసక్తికరంగా షో మారడంతో టీవీలకు అతుక్కుపోయారు.
ఇలాంటి సమయంలో ఇంట్లో సభ్యులు భావోద్వేగాలు వ్యక్తపరచడంతో ఇదంతా ఓవర్ యాక్షన్ అని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి అఖిల్ ను అంతా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఇంటి నుండి బయటకు పంపించిన వారు తర్వాత లోపల చాలా సమయం దాని గురించి చర్చించుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సోహెల్ అయితే అర్ధరాత్రి లేచి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. అఖిల్ గుర్తొస్తున్నాడు అని అన్నాడు. దీంతో సభ్యులందరూ అఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు అన్న భ్రమలో ఉన్నారు.
సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ అందరి మాటలు వింటున్నాడు. మరిముఖ్యంగా అభిజిత్ మాట్లాడుకునే మాటలు బిగ్బాస్ క్లారిటీగా వినిపించాడు. ఆ తర్వాత అఖిల్ కు బిగ్ బాస్ మరో ఆఫర్ మరొక ఆఫర్ ఇచ్చాడు. ఇంతవరకు ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ను పంచుకోవాలని కంటెస్టెంట్ లకు కండీషన్ పెట్టిన బిగ్ బాస్ అలా చేస్తే మీ ఇంట్లో వారు మీకు రాసిన లెటర్లు మీకొస్తాయని చెప్పాడు.
అయితే ఆ లెటర్ ఎవరికి వెళ్లాలి ఎవరికి వెళ్ళకూడదు అన్నది అఖిల్ చేతిలో ఉంది. అతను కావాలనుకొనే వారికి వారి ఇంట్లో వారు రాసిన లెటర్స్ పంపించవచ్చు… లేదా ముక్కలుముక్కలుగా చేయవచ్చు. ఇదే సమయంలో అభిజిత్ కి వచ్చిన లెటర్ ను అతను ముక్కలు ముక్కలు గా చేసినట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. మరి అభి పైన అఖిల్ అంత వైరం ఎందుకు పెంచుకున్నాడు అన్నది అర్థం కావడం లేదు.