పోలీస్ శాఖపై అలిగిన మంత్రి అఖిలప్రియ

కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ సభలకు పోలీసు బందోబస్తు లేకుండానే పాల్లొంటున్నారు.

‘పోలీసులు కార్డ‌న్‌సెర్చ్ పేరుతో టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారని’  మంత్రి అఖిలప్రియ అన్నారు. ‘మా కార్యకర్తలకు లేని ప్రొటెక్షన్ నాకు అవసరం లేదని ఆమె అన్నారు’. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నక్సల్స్ ప్రాంతాలైన నల్లమల్ల ఫారెస్టు సమీపంలోని రుద్రవరం మండలం టి లింగందిన్నె గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు.