NewsOrbit
న్యూస్

అఖిల ప్రియ ఆలోచన కన్నా వరకూ చేరిందా?

కొన్ని సందర్భాల్లో బాబు వ్యవహారశైలిని చూసినవారు… “తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” అనేది బాబు వల్లే పుట్టిందేమో అంటుంటారు. దానికి బాబు పెట్టుకున్న ముద్దు పేరు “రెండు కళ్ల సిద్ధాంతం”! అవును… కీలకమైన సమయాల్లో, కీలకమైన విషయాలపై బాబు ఎంచుకునే విధానం, అనుసరించే పద్ధతి ఇలానే ఉంటుంది. అది సమైక్యాంధ్ర ఉద్యమం అయినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అయినా, ఏపీకి ప్రత్యేక హోదా నినాదమైనా! సందర్భం ఏదైనా, అది ఎంత ప్రాముఖ్యమైంది అయినా బాబు ప్రవర్తన ఇలానే ఉంటుందని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అఖిలప్రియ – సుబ్బారెడ్డిల వ్యవహారంలో కూడా మరోసారి బాబు “తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” పద్దతినే ఎంచుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ క్రమంలో అసలు అక్కడ ఏమి జరుగుతుంది అన్న విషయాలపై బాబు ఎంతవరకూ ఆరా తీశారు.. తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతలపై ఈస్థాయిలో రచ్చ రచ్చ జరుగుతుంటే ఏమి స్పందించాలనుకుంటున్నారు.. ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది ఇప్పటికీ సీక్రెట్టే! అసలు ఇది తన పరిధిలో వ్యవహారం కాదు అనేది బాబు ఆలోచన అన్నది కొందరు చెబుతున్న మాట! ఎక్కడ తమ నాయకుల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినా… అవి అధినేత స్థాయివి కాకపోతే.. స్థానికంగా ఉన్న పెద్ద నేతలే చక్కబెడుతుంటారు. కానీ… సీమలో అందునా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో లింకయిన విషయాల్లో కచ్చితంఆ అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన.. పార్టీ అధినేత అయిన బాబు స్పందించాలి! కానీ… అదెక్కడా కనిపించడం లేదు!

దీంతో… అలకబూనారంట ఇద్దరు నేతలు! దీంతో తనపై ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చినా, తాను ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా అధిష్టానం నుంచి కాస్తైనా ఉపశమనం కలిగించే మాటలు కానీ, తనను బయటపాడేసే చేష్టలు కానీ బాబు & కో నుంచి రావడం లేదని అంటున్నారట అఖిల ప్రియ! ఇందులో భాగంగా ఆమె పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారట. అలా అని వైకాపాకు రాలేని పరిస్థితి… వద్దామనుకున్నా, గేట్లు తీస్తే పరిస్థితి లేదు! దీంతో కమళం వైపు చూస్తున్నారట అఖిల ప్రియ! కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే కాస్తో కూస్తో మేలని ఆమె భావిస్తున్నారంట. దీంతో… టీడీపీకి అఖిల ప్రియ గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంపై బాబు స్పందిస్తారా… పోయినోళ్లలో ఈమె ఒకరని సైలంట్ అయిపోతారా అనేది వేచి చూడాలి! అఖిల ప్రియ ఇలా ఆలోచిస్తున్నారని వస్తోన్న గాసిప్పులు కన్నా వరకూ చేరితే ఆయన ఎలా ఆలోచిస్తారు అనేది మరో ప్రశ్న!

Related posts

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju