న్యూస్

అతి చిన్న బడ్జెట్ తో కిడ్నాప్ సినిమా తీసిన అఖిలప్రియ!అవాక్కవుతున్న పోలీసులు!

Share

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే ఇంత ఈజీగా ప్లాన్ చేశారా అనిపిస్తుంది. సినిమాలో అయితే భారీ ఖర్చుతో బీభత్సమైన సెట్టింగ్‌ల మధ్య సీను తెరకెక్కుతుంది.

కానీ ప్రవీణ్ రావు సోదరుల నిందితుల కిడ్నాప్ మాత్రం నిందితులు ఓ ఈవెంట్‌లా ఆర్గనైజేషన్ చేశారు. అసలు సూత్రదారుల చేతికి ఎక్కడా మట్టి అంటకుండా కిరాయి మనుషులతో పకడ్బందీగా పని కానిచ్చేశారు. అసలు దీనికైన ఖర్చు, టీం డీటెయిల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ముందు ఒకరు, ఆ తర్వాత ముగ్గురు, తర్వాత 15 మంది అరెస్టయిన వాళ్లే వీరంతా. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దర్శకత్వంలో జరిగిన కిడ్నాప్ కేసు ఇప్పడు పీక్స్‌‌కి చేరుకుంటుంది. దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేశారు. హఫీజ్‌పేట లాండ్ వ్యవహారంలోనే ఈ కిడ్నాప్ చేసినట్లు అఖిలప్రియ పోలీస్ కస్టడీలో చెప్పారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగానే కేసు కొలిక్కొస్తుంది.

జస్ట్ పది లక్షలే బడ్జెట్!

వందల కోట్ల ల్యాండ్ సెటిల్‌మెంట్ కోసం కేవలం రూ.10 లక్షలతో ఈ డీల్ కుదుర్చుకున్నారు. కిడ్నాప్ చేయడానికి కావలసిన మనుషులను అరేంజ్ చేయడానికి గుంటూరు శ్రీను.. సిద్దార్ధ్ అనే వ్యక్తిని కలిసాడు. 15 నుంచి 20 మందిని సిద్దం చేయాలని అందుకోసం సిద్ధార్థ్‌కి రూ.5 లక్షలు అందించాడు. మిగతా వారికి ఒక్కొక్కరికి పాతిక వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.74 వేలు అందించారు. విజయవాడలో బౌన్సర్లను సరఫరా చేసే సిద్ధార్థ్ కిడ్నాప్ కోసం మనుషులను రెడీ చేశాడు. కిడ్నాప్ కోసం హైదరాబాద్ వచ్చిన వారందరికి కూకట్ పల్లిలోని ఓ లాడ్జిలో అకామిడేషన్ ఏర్పాటు చేశాడు. ఐటీ అధికారులుగా కనిపించేందుకు ఫార్మల్ డ్రెస్‌లను రెడీ చేశారు. భార్గవ్ రావు, విఖ్యాత్ రెడ్డిల పేరుతో స్టాంప్ పేపర్‌లను సిద్దం చేసి ఐటీ దాడులు చేసే విధంగా వెళ్లి ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేశారు.కిడ్నాప్ వరకు సక్సెస్ఫుల్గా చేయగలిగారుగాని ఆ తర్వాతే డ్యామిట్ ..కథ అడ్డం తిరిగింది !కిడ్నాప్ అయిన వారు సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు కావడంతో పోలీసులు మహా స్పీడ్ గా వ్యవహరించారు.ఇక తప్పించుకునే మార్గం కానరాకపోవడంతో కిడ్నాపర్లు ప్రవీణ్రావు బ్రదర్స్ ని వదిలిపెట్టి పరారయ్యారు.

 


Share

Related posts

ఫోర్జరీ కేసులో ఆ ప్రముఖ వ్యక్తి అరెస్ట్..!

bharani jella

Parliament Monsoon Session 2021: గేరు మార్చిన వైసీపీ..! కేంద్రంపై ఇక యుద్ధమేనా..!?

somaraju sharma

NTR 30: ఆచార్య తర్వాతే ఎన్టీఆర్30..ఎందుకంటే..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar