25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అఖిలేష్‌ను ఆపిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం!

Share

సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) వెళ్లకుండా లక్నో పోలీసులు అడ్డుకోవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌పి కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ వారిపై విరుచుకు పడ్డారు.

అలహాబాద్ యూనివర్సిటీలో ఒక విద్యార్ధి సంఘం కార్యక్రమానికి బయలుదేరిన అఖిలేష్‌ను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి లిఖిత ఉత్తర్వులూ లేకుండా తనను ఎయిర్‌పోర్టులో నిర్బంధించారని అఖిలేష్ ట్వీట్ చేశారు.

అఖిలేష్ ఆ కార్యక్రమానికి వెళితే హింస చెలరేగుతుందన్న సమాచారం అలహాబాద్ అధికారుల నుంచి రావడంతో ఆయనను ఆపాల్సివచ్చిందని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ పేర్కొన్నారు. ఒక విద్యార్ధి సంఘం నాయకుడి పదవీస్వీకార కార్యక్రమం చూసి కూడా ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఎంత భయపడుతున్నదో దీని వల్ల అర్ధం అవుతోందని అఖిలేష్ వ్యాఖ్యానించారు.

బిజెపి ప్రభుత్వం నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు ఈ సంఘటన నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దీనిపై స్పందించారు. ‘గుజరాత్‌లో జిగ్నేష్ మేవానీని కూడా ఇలాగే అడ్డుకున్నారు. వారు విద్వేష రాజకీయాలు నడుపుతారు. పైగా నీతులు చెబుతారు. దేశంలో ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.


Share

Related posts

Sarkaru Vaari Paata: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేశ్ కోసం అతిథిగా వచ్చే స్టార్ హీరో ఆయనేనా..!

GRK

జగన్ కోట్లు వద్దన్నా

somaraju sharma

AP Inter Exams: ఏపిలో ఇంటర్ పరీక్షలు వాయిదా..?  ఇంటర్ విద్యామండలి క్లారిటీ ఇది

somaraju sharma

Leave a Comment