Akkineni akhil: అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ వున్నట్లు పోస్టర్లు బట్టి తెలుస్తోంది. నోట్లో సిగరెట్ పెట్టుకోవటం మాత్రమే కాక అర్జున్ రెడ్డి సినిమా మాదిరిగా.. జేమ్స్ బాండ్ తరహా లో చాలా కన్నింగ్ పాత్ర అన్న రీతిలో.. అఖిల్ క్యారెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంమీద చూసుకుంటే యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేస్తూ సురేందర్ రెడ్డి ఈ సినిమా చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కు సంబంధించి మొదటి నుండి అనేక పేర్లు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో సీనియర్ సూపర్ స్టార్ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు ఇప్పటికే ఆయన కి స్క్రిప్ట్ వినిపించినట్లు ఆయన ఓకే అన్నట్లు వార్తలు ఇండస్ట్రీ లో వైరల్ అవుతున్న యి.
Read more: Akhil Akkineni : అఖిల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్స్ అదుర్స్..!!
సినిమాలో విలన్ పాత్ర.. కీలక మన్నట్లు అందువల్లే సీనియర్ హీరో ని తీసుకోవాలని.. సురేందర్ రెడ్డి ముందునుండి డిసైడ్ అవ్వటం జరిగిందట. అయితే మొదటిలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అని.. వార్తలు రాగా ఇప్పుడు తాజాగా మమ్ముట్టి ని తీసుకుంటున్నట్లు.. కన్ఫర్మ్ అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీ నుండి హీరో గా ఎంట్రీ ఇచ్చినా గానీ ఇప్పటివరకు అఖిల్ కి హిట్టు పడకపోవడంతో అక్కినేని అభిమానులు ఏజెంట్ సినిమాతో అయినా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. డాన్స్ పరంగా ఫైట్స్ పరంగా అదే రీతిలో గ్లామర్ పరంగా అన్నీ ఉన్నా గాని అఖిల్ కి హిట్ పడక పోవటం పట్ల అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా.. కొంత నిరుత్సాహం చెందుతున్నట్లు ఈ పరిస్థితుల్లో కచ్చితంగా ఏజెంట్..తో అఖిల్ కి మంచి హిట్ రావటం గ్యారెంటీ అని ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు.