అయ్యయ్యో .. ఎంతపని చేశావ్ పూజా .. రాధే శ్యామ్ పై లీక్ చేసెసింది ??

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ లో రూపొందుతున్న 20 వ సినిమా ‘రాధే శ్యామ్’. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుందని ప్రచారం జరుగుతుంది.

Prabhas 20 titled 'Radhe Shyam', first look with Pooja out

అయితే ఝార్జియా వెళ్లి నాలుగు రోజులు షూటింగ్ చేసేప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 వార్తలు సంచలనం కావడంతో ఉన్నట్టుండి ఫారిన్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకుని చిత్రబృందం వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా ఏ సినిమా కూడా చిత్రీకరణ జరగలేదు. 5-6 నెలలుగా షూటింగుల్లేక ప్రభాస్ .. పూజా హెగ్డే, చిత్రబృందం అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంత లాంగ్ గ్యాప్ రావడంతో అందరికి విసుగొచ్చిందని అంటున్నారు. అయితే ఎట్టకేలకు షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారన్న మ్యాటర్ లీక్ చేసిన్ది పూజా హెగ్డే.

త్వరలో రాధే శ్యామ్ షూటింగ్ ప్రారంభం కాబోతుండటం చాలా ఉత్సాహాన్నిస్తుందని పూజా తెలిపింది. పూజా ప్రస్తుతం లాక్ డౌన్ చాలా చికాకుగా మారిందని తాను మళ్లీ షూటింగులో చేరడానికి ఎంతో ఆతృతగా ఉన్నట్టు పూజా హెగ్డే తెలిపింది. ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో రాధే శ్యామ్ షూటింగ్ మొదలవబోతున్నట్టూ వెల్లడించింది. ఈ సినిమాతో పాటు అఖిల్ సరసన పూజా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లోనూ నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో పూజా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.


Share

Related posts

Digangana Surya vanshi Beauty Pics

Gallery Desk

NIHARIKA: మెగా ఫ్యామిలీ పై నీహారిక సెనేషనల్ కామెంట్స్ … !

Ram

Eye Problems: అందుకే పెద్దవారు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయమంది..!!

bharani jella