మందుబాబులకు ఒక షాకింగ్ న్యూస్!! కరోనాకి ఇవ్వనున్న వ్యాక్సిన్ ను వేసుకున్న వారు కొన్ని రోజులపాటు మద్యానికి దూరంగా ఉండాలట. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పాటించాల్సిన ఆహార నియమాల గురించి ఇటీవల నిపుణులు వివరిస్తూ ఆహారపదార్థాల విషయంలో ప్రత్యేకంగా కండిషన్లు పెట్టకపోయినా, మద్యం విషయంలో మాత్రం తాగకుండా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం, కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒకవేళ సైడ్ ఎఫెక్స్ట్ వస్తే వైద్య సహాయం తక్షణమే అందించడానికి కసరత్తులు చేస్తుంది. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న వారిని తర్వాత 15 నిముషాల పాటు అబ్జర్వేషన్లో ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది. వాక్సిన్ తీసుకున్న రోజు అలాగే ఆ తర్వాత మరో రోజు కూడా మద్యానికి దూరంగా ఉంటే ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టీకా సమర్థంగా పనిచేయాలన్నా అలాగే దుష్ఫలితాలు రాకుండా ఉండాలన్నా ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
టీకా నిల్వ, రవాణా వంటి వ్యాక్సినేషన్‌కు అవసరమైన మౌలిక సామగ్రిని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. ప్రభుత్వం ఈ టీకా ను ప్రాధాన్య క్రమంలో అందించనున్నది. కేంద్రం మార్గదర్శకాలనే దీనికి ప్రాణాణికంగా తీసుకోనున్నారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న వారు కూడా టీకా తీసుకోవడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నవారికి టీకాని ఇవ్వరట. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత వారికి తొలి డోసు వాక్సిన్ ను అందిస్తారట.
అయితే, ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటి ఉంది అది, మొదటిసారి వేసిన కంపెనీ టీకాను మాత్రమే రెండోసారి కూడా వేస్తారు. అలాగే, మొదటి టీకాకు, రెండో టీకాకు మధ్య 28 రోజుల వ్యవధి ఉండేలా చూసుకోవాలట. కేంద్రం ఈ లెక్క ప్రకారమే మన రాష్ట్రానికి వ్యాక్సిన్ పంపిణీ చెయ్యనుంది. వాక్సిన్ ను ఒకే డోసు మాత్రమే తీసుకుంటే కరోనా వైరస్ నుంచి కొంతవరకే రక్షణ ఉంటుంది. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం వ్యాధి సంక్రమించకుండా అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలట.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…