LIC: ఈ విషయం LIC (లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పాలసీ దారులకు మాత్రమే వర్తిస్తుంది. త్వరలో LIC IPO రాబోతున్న విషయం అందరికీ తెలిసినదే కదా. అయితే ఈ IPO ద్వారా 5 శాతం వాటాలను అమ్మనుంది మన కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను IPO ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. ఇక LIC IPOలో పాలసీదారులకు ఆఫర్ సైజ్‌లో ఓ 10% కోటా వెసులుబాటు కల్పించింది. అంటే LIC పాలసీ ఉన్నవారు ఈ IPOకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయొచ్చు. వారికి ఇష్యూ ప్రైస్‌లో డిస్కౌంట్ కూడా లభించనుంది.
AP Police: సీబీఐపై రివర్స్ కేసు..! జగన్ సర్కార్ బిగ్ మిస్టేక్..!?
LIC: డిస్కౌంట్ ఎంత?
ప్రస్తుత సమాచారం మేరకు డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎంప్లాయీ కోటా 5% ఉండనుంది. పాలసీ హోల్డర్ కోటాలో గరిష్టంగా రూ.2 లక్షల వరకు బిడ్ దాఖలు చేసుకోవచ్చు. LIC పాలసీ ఉన్నవారు రీటైల్ కోటాతో పాటు పాలసీహోల్డర్ కోటాలో కూడా అప్లై చేయొచ్చు. LIC పాలసీదారులు IPOకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పకుండా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయవలసి ఉంటుంది. LIC పాలసీహోల్డర్లు 2022 ఫిబ్రవరి 28 లోగా తమ పాన్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాలసీహోల్డర్లకు డీమ్యాక్ అకౌంట్ తప్పనిసరి.
LIC: LIC IPOను ఖచ్చితంగా తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్
ఇలా పాన్ కార్డు లింక్ చేయాలి!
– LIC పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయడానికి ముందుగా https://licindia.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
– తరువాత హోమ్ పేజీలో Online PAN Registration పైన క్లిక్ చేయాలి.
– ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేసి, ఆ తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
– తదుపరి జెండర్ సెలెక్ట్ చేయాలి. ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
– తరువాత పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డుపై ఉన్నట్టుగా పూర్తి పేరును ఎంటర్ చేయాలి.
– ఆ తరువాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, Get OTP పైన క్లిక్ చేయాలి.
– ఇపుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని వివరాలన్నీ సరిచూసుకొని ఎంటర్ చేయాలి.