PF Account: మీరు పీఎఫ్ ఆకౌంట్ ను వాడుతున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ న్యూస్ మీ కోసమే.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPS)కంట్రీబ్యూషన్ ఏడాదీలో రూ.2.5 లక్షలు దాటితే పన్ను విధించడానికి కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ లిమిట్ రూ.5 లక్షల వరకు ఉండనుంది. కొత్త ఇన్ కం ట్యాక్స్ రూం ప్రాకారం ఫీఎప్ రెండు భాగాలుగా ఉండనుంది. ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ ఖాతాలో ట్యాక్సిబుల్, నాన్ ట్యాక్సిబుల్ అనే రెండు భాగాలు ఉండనున్నాయి.
PF Account: మీకు PF అకౌంట్ ఉందా? అయితే ఈ విషయాన్ని మర్చిపోవద్దు!
PF Account: పన్ను బాదుడుపై తెలుసుకోవాల్సిన అంశాలు
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈఫీఎఫ్ఓ ఇటీవలే పీఎఫ్ ఆకౌంట్ పై వడ్డీరేట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేటు 40ఏళ్ల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. ఇలాంటి సమయంలో పన్ను బాదుడు నిబంధనలు అమల్లోకి రావడం చర్చనీయాంశమైంది.
పీఎప్ వడ్డీరేటు 8.1గా ఉంది. 1977-79 నుంచి చూస్తే ఇంత తక్కవ ఎప్పుడూ లేదు.
TDP: టీడీపీకి షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు… ట్విట్టర్ ఖాతా హ్యాక్..k
ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండే వారి పీఎఫ్ ఆకౌంట్లో రూ. 5లక్షలు కంట్రిబ్యూట్ చేస్తే అందులో రూ.2.5లక్షలకు ట్యాక్స్ పడనుంది. ప్రభుత్వ ఉద్యోగి రూ. 6లక్షలు కంట్రిబ్యూట్ చేస్తే రూ.లక్షకు ట్యాక్స్ పడనుంది.నెలకు రూ.15వేలు వేతనం పొందే ఉద్యోగులకు పీఎఫ్ ఆకౌంట్ తప్పనిసరి. రూ.2021 మార్చి 31 వరకూ ఉన్న అన్న పీఎఫ్ కంట్రిబ్యూషన్స్ ను నాన్ ట్యాక్సీ బుల్ కంట్రిబ్యూషన్స్ గా పరిగణలోకి తీసుకుంటారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు ఈ కొత్త రూల్ వర్తించనుంది.
లిమిట్ దాటినా పీఎఫ్ కంట్రిబ్యూషన్స్ ట్యాక్స్ పడుతుంది. కొత్త రూల్స్ ద్వారా అధిక ఆదాయం కలిగిన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందకుండా కేంద్రం చర్యలను తీసుకుంటోంది. ఈ కొత్త రూల్ వల్ల ఒక శాతం మంది తక్కువ మంది పైనే ప్రతికూల పడుతుందని కేంద్రం వెల్లడించింది.
కొత్త రూల్ అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇన్ కం ట్యాక్స్ రూం 1962కు సెక్షన్ 9డిని కేంద్రం కొత్తగా జత చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తోంది.