బొమ్మ అదిరింది షో ప్రారంభం అవడమే ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ను అనుకరిస్తూ ఏదో స్కిట్ వేయడం.. అది పెద్ద వివాదం అవడం చూశాం. అదిరింది షోనే బొమ్మ అదిరింది షోగా మార్చారు.
అదిరింది షో ఉన్నప్పుడు నాగబాబు, నవదీప్ జడ్జిలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదిరింది షో నుంచి నవదీప్ ను తప్పించారు. షో పేరు కూడా మార్చి.. బొమ్మ అదిరింది అంటూ పెట్టారు. జడ్జిలుగా నాగబాబు, అలీ, జానీ మాస్టర్ లు ఉండగా… యాంకర్ గా శ్రీముఖిని తీసుకున్నారు.
తాజాగా తదుపరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో అలీ ఎంట్రీ ఇచ్చాక.. నాగబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని చెబుతూ.. ఒకానొక సందర్భం గురించి గుర్తు చేసుకున్నాడు అలీ.
నాగబాబు అన్న ఓసారి సింగపూర్ నుంచి చిన్న మ్యూజిక్ కీబోర్డును తీసుకొచ్చాడు. దీన్ని నేను ముందే నేర్చుకున్నాను తెలుసా అని నాతో అన్నాడు. అన్నా ఏంటి అన్నా.. ఎక్కడ నేర్చుకున్నావు అని నేను అడిగా. దీంతో బై బర్త్ రా.. అని నాగబాబు అన్నాడు. దీంతో నేను నోరెళ్లబెట్టా. ఇంకోటి వాయించనా అన్నాడు. అని ఓ స్విచ్ వేశాడు. ఉత్తి వేళ్లే వెళ్తున్నాయి తప్ప.. అక్కడ ఏం లేదు. ఆహా.. ఇదేదో కాట్రవల్లి ఇది.. అంటూ నాగబాబును స్టేజీ మీదనే అనేశాడు అలీ.
https://www.youtube.com/watch?v=cQZ5DA5aiYY