మన తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. అలా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. అందుకే మన తెలుగులో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్లు కూడా క్యూ కడుతున్నారు. వారిలో బాలీవుడ్ యంగ్ హీరో ఆలియా భట్ కూడా ఉంది. ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది RRR సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది. అలానే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్రతో అభిమానులకు మరింత దగ్గర కానుంది. అయితే ఆమె నటించిన ఒక లేటెస్ట్ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి మూవీ బృందం సిద్ధమైంది. ఆ సినిమా ఏంటి?
డార్లింగ్స్ మూవీ
ఆలియా భట్ నటించిన బాలీవుడ్ మూవీ ‘డార్లింగ్స్’ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సాధారణంగా ఈ రోజుల్లో ఓటీటీలలో వచ్చే అన్ని సినిమాలు దక్షిణాది భాషలలో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇంగ్లీష్ సినిమాలు కూడా ప్రాంతీయ భాషల్లో డబ్ అవుతున్నాయి. కానీ డార్లింగ్స్ మూవీని తెలుగు, తమిళం భాషలలో డబ్ చేసి అందించలేదు. దీని వెనుక ఒక సమంజసమైన కారణమే ఉంది.
తెలుగు, తమిళంలో రీమేక్
డార్లింగ్స్ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా కనిపించగా విజయ్ వర్మ హీరోగా నటించాడు. అందులో ఆలియాను అనుమానంతో బాధపెట్టే భర్తగా విజయ్ కనిపించాడు. దీన్ని అన్ని భాషలలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే దక్షిణాది ప్రేక్షకులకు కూడా సినిమా చూసే అవకాశం ఉండేది. కానీ అలా చేస్తే సినిమా బృందానికి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే డార్లింగ్స్ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలనుకున్నారు. అందుకే మేకర్స్ దక్షిణాది భాషలలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయలేదు. జస్ట్ హిందీ లాంగ్వేజ్ వరకే రైట్స్ అమ్ముకున్నారు. అయితే తెలుగు, తమిళం భాషలలో ఒకే హీరోయిన్ నటిస్తుందా, లేకపోతే వేర్వేరు హీరోయిన్స్ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.