దర్శక ధీరుడు రాజమౌళి తీయాలనుకున్న సినిమాలో క్యారెక్టర్ కి ఒక నటి లేదా నటుడు కావాలంటే వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు. ఎంచుకున్న ఆర్టిస్ట్ ని ఎంత కష్టపెట్టాలో అంతా కష్టపెడతారు. అందుకు ఉదాహరణ లెక్కలేనన్ని ఉన్నా ఒకసారి గుర్తు చేసుకోవాలంటే మాత్రం బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా, నాజర్, కాలకేయ పాత్రలో నటించిన ప్రభాకర్. ముఖ్యంగా కాలకేయ గా ప్రభాకర్ ఎప్పటికి అందరికి గుర్తుండిపోతాడంటే అది రాజమౌళి కారణంగానే అని చెప్పాలి.
ప్రస్తుతం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో నటిస్తున్నారు. కాగా రాం చరణ్ కి జంటగా సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ..ఎన్.టి.ఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరీస్ నటిస్తున్నారు.
ఇక అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 5 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నీ బద్రతల మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో చిత్రీకరణ ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ మీద చిత్రీకరణ జరుపుతున్నాడట రాజమౌళి. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రకి సంబంధించిన సీన్స్ షూట్ చేసి టీజర్ రెడీ చేయనున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్, చరణ్ లు తమ పాత్రలకి తామే అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రాజమౌళి చెప్పిన ఒకే ఒక్క మాట తో ఆలియా కూడా తెలుగులో తన పాత్ర కి సొంతగా డబ్బింగ్ చెప్పుకోబోతుందట. అలా ఎవరి పాత్రకి వారే డబ్బింగ్ చెప్పడం వలన ఒరిజినల్ ఫీల్ మిస్ కాదన్న ఉద్దేశ్యంతోనే రాజమౌళి భావించారట. మొత్తానికి ఇలా చేయడం ఆలియా కి కాస్త కష్టమే అయినా మొదటిసారి, అదికూడా తెలుగులో తన పాత్రకి డబ్బింగ్ చెప్పబోతుండటం గొప్ప విషయమే అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?