న్యూస్ సినిమా

ఇలాంటి నీచుడినా ఆలియా పెళ్లి చేసుకుంది.. రణబీర్‌ కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్!

Share

ఆలియా భట్ బరువు పెరగడంపై రణ్‌బీర్ కపూర్ చేసిన అవమానకర కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఆలియా జూన్‌లో తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. భారతదేశంలో ఒక గర్భిణీని ఎంత గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే గర్భవతులను దేవతలా భావించి వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలను కురిపిస్తారు. కానీ ఆలియాకి భర్త అయిన రణ్‌బీర్‌కి మాత్రం ఆ సోయి లేదు. తన భార్యని ఇబ్బంది పెట్టి ఈ హీరో ఇప్పుడు అందరి ఆగ్రహానికి గురవుతున్నాడు.

బాడీ షేవింగ్ కామెంట్స్

ఈ దంపతులు మొట్టమొదటిగా కలిసి నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ ఫాంటసీ డ్రామాను గురువారం వీరిద్దరూ కలిసి ప్రమోట్ చేశారు. ఈ సమయంలోనే ఈ సినిమాని ఎందుకు విస్తృతంగా ప్రమోట్ చేయలేకపోతున్నారు? అన్ని ప్రదేశాలకు వెళ్లి ప్రమోట్ చేయొచ్చు కదా అని ఇంటర్వ్యూయర్ అడిగారు. అప్పుడు ఆలియా బదులిస్తూ… చేస్తాము, త్వరలోనే అన్ని ప్రదేశాల్లో కూడా ప్రమోషన్స్ చేస్తామని చెబుతుండగా మధ్యలో రణ్‌బీర్‌ కల్పించుకున్నాడు. అతడు ఆలియా బేబీ బంప్ చూపిస్తూ ఆమె భారీగా బరువు పెరుగుతోంది, అందుకే నడవలేక ప్రమోషన్స్ చేయట్లే అని కామెంట్ చేశాడు. ఆ మాటలు విన్న ఆలియా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఒక బిడ్డని మోస్తున్న తనపై ఇలాంటి బాడీ షేవింగ్ కామెంట్స్ ఏంటని ఆమె ఖంగుతిన్నది. తర్వాత జోకు జోకు అంటూ ఆమె వీపుపై రుద్దుతూ కూల్ చేయడానికి ప్రయత్నించాడు రణ్‌బీర్‌.

ఇలాంటి నీచుడినా నువ్వు పెళ్లి చేసుకుంది?

ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ఆలియా ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. “ఆలియా, ఇలాంటి నీచుడినా నువ్వు పెళ్లి చేసుకుంది? గతంలో కూడా కత్రినా కైఫ్ బాడీ గురించి అవమానకరంగా కామెంట్ చేసావ్. రణ్‌బీర్, అసలు నీకు బుద్ధుందా?” అని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నించారు. అతను ఆలియాని బాడీ షేమింగ్ చేయడం చాలా ‘అసహ్యంగా ఉందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. @ranbirkapoor143_ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది. దీనిని చూసేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.


Share

Related posts

Death: చావు కి వెళ్లివచ్చి స్నానం చేయకుండానే ఇంట్లోకి వెళ్లవచ్చా??

Naina

తెలంగాణలో కూడా కొడాలి నాని లాంటి మంత్రి తయారయ్యాడే!దుమారం రేపుతోన్న ‘పువ్వా’డ వ్యాఖ్యలు!

Yandamuri

Bigg Boss 5 Telugu: 12వ వారం లో షణ్ముక్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్..!!

sekhar