వింతగా కనిపించిన ప్రతి వస్తువూ, ఆకారం జనాలను ఆకర్షితులను చేస్తుంటుంది. అదేంటో కొత్త ఆకారం కనిపించిందంటే చాలు ఏంటది.. ఏంటది అంటూ తెగ చూసేస్తుంటారు. మరీ ముఖ్యంగా వింత వింత ఆకారంలో కనిపించే దెయ్యాలన్నా, ఏలియన్ల సినిమాలన్నా జనాలు ఎగబడి మరీ చూస్తుంటారు. బయమేసినా సరే అలాంటివే చూస్తుంటారు. అలాంటి వారిని ఆకర్శించేదే ఈ వార్త..
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో శనివారం వింత ఆకారంలో ఉన్న బెలూన్ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఆకాశంలో ఎగురుతున్న ఒక వింత వస్తువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక స్థలానికి పోలీసులు చేరుకుని వింత వస్తువును పట్టకున్నారు. ఈ బెలూన్ ఉదయం డాంకౌర్ ప్రాంతంలో ఆకాశంలో కనిపించింది.
ఆ తరువాత భట్టా పార్సాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కాలువలో దిగిందని పోలీసులు తెలిపారు. దానిని కొంత మంది ‘గ్రహాంతరవాసి’ అని అనుకుని గుమిగూడారు. అది గాలితో నిండిన బెలూన్ అని పోలీసులు వివరించారు. ఆకాశంలో పైకి వెళ్లిన తరువాత దిగి కాలువ వెంబడి పొదల్లో చిక్కుకుంది. బెలూన్ లోని ఒక భాగం కాలువలోని నీటిలో తాకడం వల్ల బెలూన్ కొద్దిగా పేలిందని డంకూర్ ఎస్ హెచ్ ఓ అనిల్ కుమార్ పాండే పీటీఐకీ తెలిపారు. ఆ బెలూన్ ప్రమాదకరమైనది కాదని వివరించారు. అయితే ఆ బెలూన్ ను గాలిలో ఎగరేసిన వారెవరో తెలసుకుంటామని స్పష్టం చేశారు.