Bigg Boss 5 Telugu: అందరికీ టార్గెట్ అయిపోయిన ఆ కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big Boss) సీజన్ ఫైవ్ రియాల్టీ షో సగం పూర్తి అయిపోయింది. 100 రోజులకు పైగానే జరిగే ఈ షో.. 60 రోజులకు పైగానే ముగిసింది. 19 మంది ఇంటి సభ్యులు ఎంటర్ అయితే ఇప్పుడు తొమ్మిది మంది.. ఎలిమినేటి కాగా పదిమంది మిగిలారు. ఇప్పటివరకు ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదు. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్న వాళ్లు చాలా వరకు ముందుగానే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో టెలివిజన్ రంగంలో సపరేట్ క్రేజ్ బేస్ మొదటి నుండి ఉన్నవాళ్లు.. మాత్రం ప్రస్తుతం హౌస్లో రాణిస్తున్నారు. అయితే వీరిలో ఆర్ జే కాజల్(Kajal) ఒకరు. తన అదిరిపోయే యాంకరింగ్ తో  రేడియో మిర్చి ద్వారా.. తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ బిగ్ బాస్(Big Boss) షో లో… ప్రస్తుతం కీలకంగా రాణిస్తూ ఉంది. ఈ క్రమంలో హౌస్ కెప్టెన్ అవ్వడానికి భారీగా పోరాడుతూ సరికొత్త స్ట్రాటజీ లతో దూసుకు పోతోంది. నాగిని అనే టైటిల్ కూడా తన గేమ్ ద్వారా దక్కించుకుంది.

Bigg Boss Telugu: RJ Kajal Trolled For Her Double Standards -

ఇదిలా ఉంటే మొట్ట మొదటి నుండి హౌస్ లో కాజల్ తన గేమ్ ఆడుతూనే మరోపక్క సన్నీ(Sunny), మానస్(Manas) తో కలిసి.. ఆడుతూ వస్తోంది. హౌస్ లో ప్రారంభంలో సన్నీతో నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరించిన కాజల్ ఆ తర్వాత.. ఏడవ వారం నుండి కలిసి పోవడం జరిగింది. ఆ సమయంలో సన్నీ కెప్టెన్ అయిన క్రమంలో కాజల్ నీ రేషన్ మేనేజర్ గా నియమించడం జరిగింది. ఇదిలా ఉంటే కాజల్ హౌస్ లో చాలామందికి టార్గెట్ అవ్వడం జరిగింది. ప్రారంభం నుండి ఇ కాజల్ వేసే స్టేటజి లు.. బేడిసి కొట్టడంతో పాటు వాళ్ళకి వీళ్ళకి సంబంధం కలిగే రీతిలో.. కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం తో.. కాజల్ గేమ్ అంటే చాలామంది చిరాకు పడుతూ కామెంట్లు చేయడం జరిగింది. ఇంటి నుండి ఎలిమినేట్ అయిన ప్రియ ఆంటీ(Priya Aunty) అయితే కాజల్ తో నువ్వా నేనా అన్నట్టుగా ప్రతి సందర్భంలో వ్యవహరించింది. ఇక ఆ తర్వాత రవి(Ravi) అదే రీతిలో శ్రీరామ్(Sri Ram) కూడా కాజల్ తో అమీతుమీగా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్ యానీ మాస్టర్ కి ఛాన్స్

ఇదిలా ఉంటే 10 వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో రవి, శ్రీరామ్, షణ్ముఖ, కెప్టెన్ యానీ మాస్టర్… వీళ్లంతా కలసికట్టుగా గేమ్ ఆడి ఎలాగైనా కాజల్ నీ… నామినేషన్ లో ఉండేటట్లు కార్నర్ చేయటం జరిగింది. అదేరీతిలో కాజల్ కి సపోర్ట్ గా ఉంటున్న మానస్, సన్నీ లను కూడా… దూరం చేయడం జరిగింది. చివరి నిమిషంలో తృటిలో నామినేషన్ నుండి తప్పించుకుంది కాజల్ అని అనుకున్న టైమ్ లో.. బిగ్ బాస్ యానీ మాస్టర్ కి ఛాన్స్ ఇవ్వడం తో… వెంటనే కాజల్ ని సెలెక్ట్ చేసి నామినేషన్ లోకి దింపింది. మొత్తం మీద 10 వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ.. చాలా వరకు కాజల్ ని కార్నర్ చేస్తూ ఇంటిలో సభ్యులు గేమ్ ఆడారు. రవి, శ్రీరాం ఎక్కడా తగ్గలేదు. ఇద్దరికీ కూడా మొదటి నుండి కాజల్ తో… భారీగా గొడవలు అవుతూ వస్తున్నాయి. పదో వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా కాజల్.. రవిని గట్టిగానే టార్గెట్ చేసి మరీ తనకి ఆకాశం వచ్చిన సమయంలో నామినేషన్ వేయడం జరిగింది. ఆ సమయంలో శ్రీరామ్ రవి ని సేవ్ చేయటంతో.. కథ అడ్డం తిరిగి మొత్తానికి కాజల్ నీ… ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ లిస్టులో ఉండేటట్టు… చూడడం జరిగింది. ఏది ఏమైనా మాత్రం.. హౌస్ లో చాలా వరకు సన్నీ మానస్ మినహ.. మిగతా వారికి కాజల్ పెద్ద టార్గెట్ అయిపోయింది.


Share

Related posts

Vinayaka Chavithi in church:  చర్చిలో గణపతికి ప్రార్థనలు..! ఈ అరుదైన ఘటన ఎక్కడంటే..?

somaraju sharma

Corona Virus: భారత్ లో మళ్లీ మహమ్మారి పంజా..! నిర్లక్ష్యమే కారణమా..!?

Muraliak

అందుకే సుధీర్ ను నేను పెళ్లి చేసుకోవట్లేదు.. సంచలన నిజాలు బయటపెట్టిన రష్మీ

Varun G