బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న అభిజిత్ హౌస్ లో చాలా వరకు తన ఫీలింగ్స్ బయటపెట్టకుండా మైండ్ గేమ్ ప్లే చేయడం మాత్రమే కాక సరికొత్త స్ట్రాటజీ లతో దూసుకుపోయాడు. హౌస్ లో ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకపోయినా గాని టైటిల్ గేలవటం లో మాత్రం మరొకరికి చాన్స్ లేకుండా మొదటి నుండి ఓటింగ్ పరంగా ఊహించని రీతిలో దూసుకుపోతూ రాణిస్తూ.. చివరాకరికి సీజన్ ఫోర్ లో విజేతగా నిలిచాడు.
ఇదిలా ఉండగా హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా సెలబ్రిటీ అడుగుపెట్టిన అభిజిత్.. ప్రారంభంలో హౌస్ లో మోనాల్ తో బాగా క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ మరోపక్క మోనాల్.. అఖిల్ తో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో అభిజిత్ .. మోనాల్ ని లైట్ తీసుకోవడం జరిగింది. మధ్యలో ఇద్దరి మధ్య కొద్దిగా డిస్టబెన్స్ లు కూడా బాగా వచ్చాయి. ఇదే సమయంలో అభిజిత్ హౌస్ లో ఎక్కువగా హారిక తో క్లోజ్ అవ్వటంతో ఇద్దరిపై వేరేగా బయట ప్రాజెక్ట్ కావడంతో హారిక తన చెల్లెలు అంటూ అభి వచ్చిన వార్తలకు పులిస్టాప్ పెట్టినట్లయితే.
ఇదిలా ఉంటే షో ముగిశాక ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా, చిట్ చాట్ చేసినా అభిజీత్‌కి అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజా చిట్ చాట్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి అసలు విషయం చెప్పేశాడు అభిజీత్. హౌస్ లో ఆమెతో కలవడానికి కారణం బిగ్ బాస్ స్టేజ్‌పై జరిగిన ఫన్నీ గేమే అని అన్నాడు. ”ఆరోజు స్టేజ్ మీద గేమ్ ఆడాక.. లోపలికి వెళ్లి మోనాల్‌ను ఎప్పుడు కలుస్తానా అనుకున్నా. ఆమెతో చాలా రోజులు ట్రావెల్ చేయాలని భావించా. అందుకే తన గురించి తెలుసుకోడానికి ట్రై చేశా. అంతేగానీ ట్రాకులు నడపడం లాంటివి ఏమీ లేవు” అంటూ అభి చెప్పుకొచ్చాడు.