సుష్మా నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

Share

పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో భారత వైమానిక సిబ్బంది జరిపిన దాడి గురించి ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించనున్నది. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ దాడుల గురించి నేతలకు వివరిస్తున్నారు.

భారత దాడులకు ఉగ్రవాదులు ప్రతిదాడికి ప్రయత్నిస్తే ఏవిధంగా స్పందించాలన్న దానిపై కూడా అఖిలపక్షం చర్చించనుంది.

సుష్మాస్వరాజ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్నది. రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌,గులాం నబీ ఆజాద్, ఒమర్‌ అబ్దుల్లా, డి రాజా, సీతారాం ఏచూరి, విజయ్‌ గోయల్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే.

నాన్‌ మిలటరీ అపరేషన్‌ జరిగినట్లు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా దాడిచేశామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినది.


Share

Related posts

జగన్ ఇక ఇక్కడే

somaraju sharma

ఇఫ్తార్ విందు దగ్గర పాక్ ధాష్టీకం!

Siva Prasad

Ys Jagan Mohan Reddy : పోలవరంలో జగన్ ప్రపంచ రికార్డ్ – విమర్శించినవాళ్ళ కళ్ళు బైర్లుగమ్మేలా అతిపెద్ద గెలుపు..!!

sekhar

Leave a Comment