NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Vizag steel plant : ఇదో డ్రామా… పోరాటం భ్రమ!

Vizag steel plant : ఇదో డ్రామా... పోరాటం భ్రమ!

Vizag steel plant : రాజకీయ పార్టీల పోరాటాలు ఎప్పుడూ అధికార ఆరాటం మీదే ఆధారపడి ఉంటుంది. ఏదైనా విషయం మీద పో రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది అంటే ఖచ్చితంగా అది సాధించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే పోరాటం మొదలు పెడుతుంది. అంతేగాని అసలు సాధ్యం కానీ, పరిష్కారం కాని సమస్యలను రాజకీయ పార్టీలు ఎప్పుడూ పోరాటాలు ఎంచుకోవు. ఎందుకంటే ఆ పోరాటం విఫలమైతే ఆ రాజకీయ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ Vizag steel plant  ప్రైవేటీకరణ మీద రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీల ధోరణి ప్రమాదకరంగా తయారవుతుంది.

all-protest-have-temperory-for-vizag-steel Vizag steel plant
all-protest-have-temperory-for-vizag-steel Vizag steel plant

** ఏ సమస్యకైనా రాజకీయాలు ముడిపడి ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించడం దాదాపు అసాధ్యం. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాటంలోనూ ఎన్నో రాజకీయాలు ఉన్నాయి. పైకి కనిపించే కొన్ని అయితే దాని వెనుక జరుగుతున్న తతంగం చాలా పెద్దది.

** రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా పోరాటం తీసుకొని, కార్మిక సంఘాల మద్దతుతో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం మొదలు పెడితే దానికి కేంద్రం కదులుతుందా..?? రాజకీయ పార్టీల పోరాటాన్ని రాష్ట్ర ప్రయోజనాల ఆరాటాన్ని గుర్తిస్తుంద అంటే దానికి సమాధానం లేదు. అంటే రాష్ట్రంలో ఎన్ని రోజులు పోరాటం చేసినా దానిని కేంద్రం ఖచ్చితంగా పట్టించుకుంటుంది అన్నది ధీమా లేదు.

** కేంద్రం, బిజెపికి వ్యతిరేకంగా పోరాడే సత్తా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ముఖ్యంగా మోడీ అమిత్ షా అంటే వల్లమాలిన గౌరవం కంటే బీభత్సమైన భయం అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఉంది. అధికార పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేసులు ఇతరాత్రా వ్యవహారాలపై భయపడితే, చంద్రబాబు సైతం ఓటుకు నోటు కేసు తో పాటు పార్టీ మనుగడ పూర్తిగా నాశనం అయిపోతుంది అనే కోణంలో మోడీ అమిత్ షా తో ఇప్పుడు గొడవపడి అందుకు సిద్ధంగా లేరు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం బిజెపి మద్దతుతో రాజకీయాలు చేయాలని భావిస్తున్న తరుణంలో కేంద్రాన్ని అడిగేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఇక వామపక్షాలు వాయిస్ ను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ పరిస్థితి చెప్పక్కరలేదు.

** కేంద్రం పూర్తిగా తన ఆధీనంలో ఉన్న అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా అమ్మేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఇది బీజేపీ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం. దీనిలో భాగంగా ఇప్పటికే 11 పెద్ద ప్లాంట్లను, సంస్థలను అమ్మేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వంతు వచ్చింది. అందులోనూ నష్టాలను సాకుగా చూపిస్తూ దానిని వదిలించుకునేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న సరే దాన్ని అమ్మకుండా ఉండరు అనే మాట తప్పు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని సంస్థలను అమ్మేయడం ద్వారా భారీగా నిధులను సేకరించే లక్ష్యంతో బీజేపీ ఉంది. కాబట్టి దాదాపు ఒక్కో సమస్యను కేంద్రం అమ్మేసి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

** ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని దేశంలోని అన్ని సంస్థానాలను క్రమంగా ప్రైవేటీకరణ చేయాలన్నది బిజెపి టార్గెట్. దీనిలో భాగంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం సంస్థలను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో కనీసం బీజేపీ కు సంస్థాగతమైన బలం కూడా లేదు. అధికారానికి దగ్గరలో రావడం అన్నది కల. మరి ఎలాంటి బలం లేని ఆంధ్రప్రదేశ్లో దేనికి లోబడి బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వెనక్కు తగ్గుతుంది..?? ఇక్కడ వారికి కనీసం రాజకీయ ప్రయోజనాలు ఆశించే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు బిజెపి స్టీల్ ప్లాంట్ విషయంలో పురాణాలు జుట్టు ఉంది అనుకోవడం భ్రమ.

** రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి అంతా తాత్కాలికం. ఖచ్చితంగా స్టీల్ప్లాంట్ విషయంలో బిజెపి వెనక్కి తగ్గుతుంది అని ఎవరూ అనుకోవడం లేదు. పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలకు ఇది తెలుసు. అయితే తమ మీదకు వ్యవహారం రాకూడదనే రీతిలో, రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినకూడదని కోణంలో , ప్రజా వ్యతిరేకత తమ పార్టీ మీద పడకూడదు అన్న రీతిలో మాత్రమే పోరాటాలకు రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంతే తప్ప లేఖల వల్ల గానీ ప్రధానిని ప్రత్యక్షంగా కలిసి చెప్పడం వల్ల గాని ప్రయోజనం ఉంటుందని అనుకోవడం పిచ్చితనం. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గొడవ లో చివరకు వెర్రి వాళ్లు అయ్యేది జనం మాత్రమే. ఎందుకంటే ఈ పోరాటాలు ఆరాటాలు జనం ఎన్నికల సమయానికి మర్చిపోతారు. మళ్లీ యధావిధిగా ఆ వారం రోజుల సెంటిమెంటు మాత్రమే ఓటింగ్ వద్దకు వచ్చేసరికి పనిచేస్తుంది. పాత విషయాలు మర్చిపోవడం ప్రజలకు బాగా అలవాటు. అందులో ఆంధ్ర ప్రజలు ప్రతి రోజు ఈ మరిచిపోయే విషయంలో గోల్డ్ మెడలిస్ట్ లు.

 

 

 

author avatar
Comrade CHE

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N