న్యూస్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

Share

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. సోమవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శిస్తారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హజరుకానున్నారు.

 

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ లోని గోల్కొండ కోట ముస్తాబైంది. వేడుకలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సీఎం కేసిఆర్ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ శాఖ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాల్లో హజరయ్యే వారికి ఇప్పటికే ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. గోల్కొండ కోట వద్ద మొత్తం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా సమాచార శాఖ ప్రత్యేక తెరలను కూడా ఏర్పాటు చేసింది. వర్షం పడినా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటర్ ఫ్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం 6.30 గంటలకు రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

 

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సత్ప్రవర్తన కల్గిన కొందరు జీవిత ఖైదీల విడుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. తెలంగాణలో 75 మంది జీవిత ఖైదీల విడుదలకు కేసిఆర్ సర్కార్ చర్యలు చేపట్టగా, ఏపిలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 175 మంది ఖైదీలను విడుదలకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. హోమ్ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

స్పీకర్ నియోజకవర్గంలో జగన్ టీమ్ నిఘా!? మార్పు తప్పదా..!?


Share

Related posts

హాస్పిటల్ బెడ్ లు ఖాళీ లేవు :  కరోనాకోసం హోటల్ రూమ్ లు

arun kanna

నిత్యం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారా.. ఈ టిప్స్ గురించి తెలుసుకోండి

Teja

Breaking : వై ఎస్ జగన్ కి బహుమతి గా బాలాపూర్ లడ్డూ – 18.90 లక్షలకి కొని జగన్ కి ఇస్తున్నాడు

amrutha