NewsOrbit
న్యూస్ హెల్త్

వామ్మో.. ఇవన్నీ కూడా కరోనా లక్షణాలే!

ప్రపంచ దేశాల కంటికి కనిపించకుండా గజగజ వణికిస్తున్న ఏకైక జీవీ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క కరోనా వైరస్ కే సాధ్యం. ఒక దేశంతో మరో దేశం యుద్దం చేయాల్సింది పోయి కరోనా వైరస్ తో యుద్దం చేస్తూనే ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు మాత్రం కరోనానే విజయం సాధిస్తూ వస్తుంది. ఎంతో మంది ప్రాణాలను తీస్తూ వస్తోంది. దీని వ్యాప్తికి మాత్రం దేశాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో దీని భారిన పడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండే కొందరిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా, మరికొందరిలో ఈ వైరస్ సోకిన ఆనవాళ్లే కనిపించడం లేదు.

ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అలాగే ఈ వైరస్ రోజు రోజుకు మరింత విజృంభించకుండా నియంత్రణ చర్యలను చేపడుతూనే ఉన్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అయినా కరోనాను మాత్రం నియంత్రించలేకపోతున్నాం. మాస్కులు ధరించండి, శానిటైజర్ ను వాడండి, సోషల్ డిస్టెన్స్ ను పాటించండి అని ప్రభుత్వాలు ఎంత చెప్పినా కొంత మంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ అవేమీ పాటించడం లేదు. అందుకే కరోనా రోజురోజుకు ఇలా వ్యాపిస్తూనే ఉంది. అయితే కరోనా లక్షణాలను సాధారణంగా జ్వరం, జలుబు, దగ్గు, కాళ్లపై ఎర్రటి చారలు వంటి లక్షణాలతో గుర్తుపట్టొచ్చు.

కాని కరోనా లక్షణాలలో మాత్రం రోజు రోజుకు ఒక కొత్త అంశం వెలుగులోకి వస్తూనే ఉంది. అలాగే కరోనా లక్షణాలలో సరికొత్త అంశాలను కూడా శాస్త్రవేత్తలు అందులో చేర్చారు. ఈ భిన్నమైన లక్షణాలను కరోనా రోగుల్లో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన వారిలో జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయని తెలిపారు. మలబద్దకం, వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు ఎవరిలోనైనా ఉన్నట్టయితే వారు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అలాగే కరోనా సోకిన వారిలో కళ్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని తెలిపారు. అంటే దురద, కనుగుడ్డులోని తెల్లని ప్రదేశం ఎర్రగా మారడం, కండ్ల కలక ఉన్నా అవి కరోనా అయ్యే అవకాశమున్నట్టు తెలిపారు. దీనితో పాటుగా కరోనా బాధితుల్లో కొన్ని మానసిక సమస్యలు కూడా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం, అంతా గందర గోళంగా అనిపించడం వంటికి కూడా కరోనా లక్షణాలేనని అంటున్నారు. ఈ కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తుల తీసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju