vijayanthi mala: వైజయంతి మాలను మేడలో ధరిస్తే ఈ ప్రయోజనాలు అన్ని దక్కుతాయి !!

Share

vijayanthi mala: వైజయంతిమాలను పూజించిన,మెడలో వేసుకున్న ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం
పెళ్లి కానీ వారు నిత్యకళ్యాణం జరిగే గుడిలో వైజయంతిమాలను వేసుకుని భగవత్ కళ్యాణం చేయిన్చుకుంటే…. వారికీ చాలా త్వరగా వివాహం అవుతుంది. ఈ మాలను మేడలో వేసుకుని రుక్మిణి కళ్యాణం ఇంటిలో గాని,గుడి లో గాని చేసుకుంటే వివాహబంధంలో వస్తున్నా సమస్యలు తొలగిపోతాయి.శుక్రవారము కానీ, దీపావళి రోజు కానీ వైజయంతిమాలను లక్ష్మీ దేవి ఫోటోకి వేసి లేక శ్రీ చక్రానికి వేసి లక్ష్మి అష్టోత్తరం ,మరియు సహస్రనామం చదివి కుంకుమార్చన,పూజ చేసి బీరువాలో, డబ్బులు డబ్బాలో ధనం దాచిపెట్టుకునే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే మెడలోకూడా వేసుకోవచ్చు. ఈ మాల మెడ లో వేసుకోవడం వలన లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

వైజయంతి మాల పూసలను చిన్న పిల్లలకు చెవి దిద్దులుగా ,లాకెట్ లాగా చేయించి వేస్తె నరదృష్టి,బాలారిష్టదోషాలు, చొంగకార్చుట వంటి సమస్యలు తగ్గుతాయి.భార్య భర్తల మద్య అస్తమానం గొడవలు వస్తుంటే వైజయంతిమాలని వేసుకోవడం వలన వారి మద్య గొడవలు తగ్గి అన్నోన్యత పెరిగి సంతోషం గా ఉంటారు.వ్యాపార సంస్థలోని పూజ మందిరంలో దేవుడి పటాలకు,విగ్రహాలకు వైజయంతిమాల ను అలంకరిస్తే వ్యాపారాభివృద్ధి జరగడం తో పాటు ధనం కూడా వృద్ధి చెందుతుంది.శుక్ర గ్రహ దోషం ఉంటే వైజయంతిమాలను మాలగా కానీ లేదా బ్రేస్ లెట్ గా గాని వేసుకుంటే.. శుక్ర గ్రహ దోషాల తో పాటు ,సప్తమగ్రహదోషాలు కూడా పోతాయి.

వైజయంతి మాలను వేసుకున్నవారు మంచి ఆలోచనా విధానంతో ప్రతి పనిని అంచనా వెయ్యగలిగే శక్తి కలిగి ఉంటారు.వైజయంతి మాలను వేసుకుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి జరుగుతుంది.శ్రీ కృష్ణుడి జన్మ స్థలమైన ఉత్తరప్రదేశ్ లో మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో వైజయంతి పూసలు లభ్యమవుతాయి. రాధా కృష్ణుల ప్రేమకు ప్రతిరూపం ఈ వైజయంతి పూసలు అని అంటారు.


Share

Related posts

వికేంద్రీకరణ సమర్థిస్తూ రావులపాలెంలో ర్యాలీ

somaraju sharma

న్యూఢిల్లీ :మధ్యవర్తి ప్రయాణాలకు 12 కోట్లు

Siva Prasad

Amazon: అమెజాన్ ఎంత పని చేసిందో… ఆడపిల్లలకు పేరు పెడదాం అంటే కొత్త కష్టాలు..

Naina