NewsOrbit
న్యూస్

stock-markets : ఈ పరుగు ఆగుతుందా! సన్స్సెక్స్ ఆల్ టైం హై!!

stock-markets : గత వారం అంతా నష్టాల బాటలో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్…సోమవారం మొత్తం తన ఆల్ టైం హై అందుకొని తన లాభాల దాహాన్ని తీర్చుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో స్వతంత్ర భారతదేశంలో భారతీయ స్టాక్ మార్కెట్ ఇంతగా ఎప్పుడూ లాభాలను స్వీకరించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఒడిదొడుకులకు లోనయ్యే స్టాక్ మార్కెట్… సోమవారం ఉదయం నుంచే లాభాల బాట పట్టింది. మదుపరులు ఎలాంటి భయం లేకుండానే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఎప్పుడూ లేనంత భారీగా స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది., అయితే ఇదే జోరు మంగళవారం కూడా చూపిస్తుందా లేక ఒడిదుడుకులకు లోనయ్యి… నష్టాలు మూటగట్టుకుంది అన్నది చూడాలి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపితే మంగళవారం మార్కెట్ అటు ఇటు గా కదలాడే వచ్చు అని విశ్లేషకుల అంచనా.

all-time-high-for-stock-markets
all-time-high-for-stock-markets

 

stock-markets : ఎన్నడూ లేనంతగా!!

సోమవారం బడ్జెట్ ప్రసంగం నిర్మల సీతారామన్ మొదలుపెట్టగానే.. మార్కెట్ జోరందుకుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి 35 వేల కోట్ల నిధి ప్రకటించడం మార్కెట్కు సానుకూలాంశం అయ్యింది. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు మార్కెట్ పరుగులు తీస్తే కచ్చితంగా అది కార్పొరేట్ కంపెనీలకు వ్యవహారాలకు అనుకూలమైన బడ్జెట్ గానే పరిగణిస్తారు. అంటే సాధారణ మధ్యతరగతి వారికి బడ్జెట్ దూరంగా ఉందనే అర్థం కూడా వస్తుంది. సోమవారం బడ్జెట్ ప్రసంగం మొదలవగానే నిర్మలాసీతారామన్ ఉక్కు అంశం చదువుతుండగానే మార్కెట్ ఎన్నడూ లేనంతగా పరుగులు తీస్తూ ముందుకు వెళ్ళింది. గతవారం అన్ని నష్టాలను భర్తీ చేసి… 2314 పాయింట్స్ లాభంలో 48,600 పాయింట్స్ దగ్గర ముగిసింది. నీఫ్టీ సైతం 600 పాయింట్స్ లాభ పడింది. గత వారం సుమారు 8 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరి అయితే… సోమవారం ఒక్కరోజే సుమారు 6 లక్షల కోట్ల వరకు లాభపడ్డారు. మార్కెట్ ఆసాంతం మూడున్నర వరకు ఎంత ఉత్సాహంగా జరిగింది. సెన్స్సెక్స్ లో నమోదైన అన్ని షేర్లు లాభపడ్డాయి. ఏ ఒక్కరు నష్టపోలేదు. గతంలో ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆ రోజు స్టాక్ మార్కెట్లు పెద్దగా లాభాలు ఉండవు నష్టాలూ ఉండవు. అయితే దీనికి విరుద్ధంగా రికార్డులను బ్రేక్ చేస్తూ మరి… భారతీయ స్టాక్ మార్కెట్ నిర్మల సీతారామన్ ప్రతి మాటకు ఉవ్వెత్తున ఎగిసి ముందుకు వెళ్లడం విశేషం.
** 2011లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో మార్కెట్ -122 పాయింట్స్ నష్టపోయింది. 2012లో -291 పాయింట్స్ వెనక్కు వెళ్ళింది. 2013లో -210 పాయింట్స్ నష్టం చవి చూసింది. 2014 లో 97 పాయింట్స్ స్వల్ప లాభం వచ్చింది. 2015లో 141 పాయింట్స్ లాభంలో ఉంది. 2016లో -152 పాయింట్స్ నష్టం, 2017లో 486 పాయింట్స్ లాభం మూట గట్టుకుంది. 2018లో -58 పాయింట్స్ నష్టంలో ఉంటే, 2019లో రెండు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టరు. 213 లాభం, -395 పాయింట్స్ నష్టం వచ్చింది. 2020లో సైతం -989 పాయింట్స్ నష్టమే వచ్చింది. ఇలా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో మార్కెట్ నష్టాలతో నే ఉంది. అయితే సోమవారం మాత్రం దానికి భిన్నంగా ఆల్టైమ్ హై అందుకోవడం భారతీయ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మదుపరులు పోటీ యువత ఆలోచన తీరును ప్రతిబింబిస్తోంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

author avatar
Comrade CHE

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju