Juice: ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టు ఊడిపోవడం, లేదా బట్ట తల రావడం అనేవి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. స్త్రీ ,పురుషులు అనే బేధం లేకుండా ఈ సమస్య వస్తుంది. అయితే దీని గురించి బాధ పడుతూ కూర్చోకుండా అద్భుతమైన కొన్ని చిట్కాలు చేస్తే జుట్టు తిరిగి ఆరోగ్యంగా,పొడవుగా పెరుగుతుంది అని తెలియచేస్తున్నారు నిపుణులు.
ఉల్లిపాయ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలోంచి నీళ్లు వస్తాయి.. ఉల్లి లో ఉండే సల్ఫర్ దీనికి కారణం. జుట్టు పెరుగుదలకు కావాల్సిన కెరోటిన్ అనే ప్రోటీన్ పెరగడానికి ఈ సల్ఫర్ బాగా ఉపయోగపడుతుంది. ఉల్లి లో ఉండే విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యం తో పాటు జుట్టుకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. సిట్రిక్ యాసిడ్, పొటాషియం,కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, జింక్ ల తో పాటు ఉల్లి రసం లో లో విటమిన్ బీ, సి, ఈ లు కూడా ఉన్నాయి. దీనివల్ల ఉల్లిని కేశ సంవర్ధిని అని కూడా అంటారు. ఉల్లి రసం తో ప్యాక్ తయారు చేసుకుని వేసుకోవడం వలన తెల్ల జుట్టు ముందు గ్రే కలర్ లో కి వచ్చి ఆ తర్వాత నిదానంగా నలుపు గా మారుతుంది. ఈ విషయం మీద తాజాగా అమెరికాలో జరిగిన పరిశోధనల్లో 4 వారాల్లో 75% 6 వారాల్లో దాదాపు 85% మెరుగుదల కనబడినట్టు తేలింది.
వెంట్రుకలు ఊడటం తో పాటు , బట్ట తల, చుండ్రు సమస్య.. వెంట్రుకలు చిట్లడం.. లాంటి అన్ని సమస్యలకు ఉల్లి జ్యూస్ తో ప్యాక్ వేసుకోవడం వలన అడ్డుకోవచ్చు అని డాక్టర్లు కూడా తెలియచేస్తున్నారు. అందునా మన బామ్మలు వాడి మరి నిరూపించిన గొప్ప చిట్కా ఇది .. ఉల్లిపాయ మన జుట్టు పాయలు పాయలుగా పెరిగేలా చేస్తుంది అని హామీ ఇస్తున్నారు డెర్మటాలజిస్ట్. ఇక హెర్బల్ ప్యాక్ లేదా రకరకాల ప్యాక్ వేసుకునే బదులు కాస్త ఉల్లి రసం తో ప్యాక్ వేసుకుని జుట్టు ను రక్షించుకుందాం.