NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏలూరు దీన స్థితికి కారణం మీరే ఉప ముఖ్యమంత్రి గారూ….

 

పశ్చిమ గోదావరి ముఖ్య కేంద్రం ఏలూరు. గోదావరి జిల్లాలకు ముఖ ద్వారం. కృష్ణ జిల్లా సరిహద్దు కేవలం 8 కిలోమీటర్లలో తగిలే నగరం. పేరుకు మాత్రమే ఇది నగరపాలక సంస్థ .. పన్నులకు మాత్రమే దీనికి ఆ పేరు పెట్టారా అన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి చూస్తే…. ఏలూరు కు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా ఆళ్ల నాని పనిచేస్తూ , ఏకంగా ఉప ముఖ్యంత్రి పదవి పొందారు.. ప్రస్తుతం ఏలూరు వింత వ్యాధితో బాధ పడుతూ, దేశ వ్యాప్త చర్చకు దరి తీసిన సమయంలో ఏలూరు ఇలాంటి పరిస్థితి రావడానికి…. అభివృద్ధిలో వెనకపడటానికి పాలకులు ఎలా కారణమో… ముఖ్యంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఏ విధంగా కారణమో పరిశీలిస్తే….

** 3 లక్షలు దాటని చిన్న నగరం ఏలూరు. విజయవాడకు కేవలం 60 కిలో మీటర్ల దూరం. రోజుకు వీరికి 8 ఎల్ఎండి ల నీరు అవసరం. అయితే నీరు లభ్యత ఎక్కడి నుంచో తెలుసా..? చిన్న కృష్ణ కాలువ డ్రైన్ నుంచి నీటిని సమ్మర్ స్టోరేజి ట్యాంక్ లోకి ఎక్కిస్తారు. గోదావరి నీరు కూడా తెచ్చామని చెప్పినా అది ఏలూరు కు ఈ మాత్రం సరిపోవడం లేదు. కేవలం కృష్ణ కాలువ నీరే శరణ్యం… ఏలూరు డ్రైనేజి లో 50 శాతం ఇక్కడ కలుస్తుందో తెలుసా? అదే కృష్ణ కాలువలో…. అంటే డ్రైనేజి పారే కాలువ నీరే ఏలూరు వాసులు తాగుతున్నారు.
** ఇక సమ్మర్ స్టోరేజి ట్యాంకులు పంపుల చెరువులో ఉన్నాయి. ఇక్కడ చెరువులు అత్యంత దారుణంగా కనిపిస్తాయి. నీటిని సైతం ఇసుక ద్వారా ప్యూరిఫై చేస్తారు. ఎప్పటిదో పాత సంప్రదాయం అయినా ఇసుకలో వడబోతా విధానం ద్వారానే ఇంకా ఇక్కడ నీటిని ప్రజలకు అందిస్తున్నారు. ఇక నీటిని సంరక్షించే చర్యలకు ఉన్న సిబ్బంది కేవలం 5 మంది మాత్రమే. వీరే రోజువారీ నీటి సరఫరాలో అన్ని తామై చూసుకుంటున్నారు.
** ఆళ్ల నాని తప్పేంది? ;    పరిశుభ్రమైన తాగునీరు అందించే ప్రత్యామ్నాయ అంశాలను ఆళ్ల నాని ఇప్పుడు పట్టించుకోలేదు. గోదావరి నీటిని సైతం ఏలూరుకు తీసుకువస్తామని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ తో ప్రారంభోత్సవం చేయించిన ఆశ్రమం దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజి ట్యాంక్ ఖాళీగా ఉంటోంది. దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏలూరు కు తమ్మిలేరు అనే ప్రత్యామ్నాయం ఉంది. నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు రిజర్వుయార్ ద్వారా నీరు వదిలితే ఏలూరుకు పుష్కలంగా వస్తాయి. కేవలం వరద నీటిని మాత్రమే దాని నుంచి వదులుతున్నారు తప్పితే.. సాధారణ సమయంలో లేదు.. ఇది ఏలూరు కు ఓ నీటి ప్రత్యామ్నాయం. దీన్ని నాని పట్టించుకుంది ఎపుడు??

** ఇక్కడ ప్రజల కు ఆధారం జ్యూట్ మిల్ . సుమారు 10 వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తాయి. ఇక చిన్న చితక పనులే తప్ప జీవన విధానాన్ని మెరుగుపరుచుకునేందుకు పెద్ద ఆధారమేది లేదు. జ్యూట్ మిల్ లో పనికి రోజువారీ కూలి 300 . అంటే నెలకు 9 వేలు. దింతో ఎక్కడి ప్రజల కొనుగోలు శక్తి లేక అది ఆరోగ్యంపై పడుతోంది. జ్యూట్ మిల్ లో భారీ శబ్దాలకు , అక్కడ కలుషిత వాతావరణానికి ఆరోగ్యాలు పాడై , కనీసం హాస్పిటల్స్ కు వెళ్లే దిక్కు లేక దీనంగా బతుకు వేళ్ళ దిస్తున్న వారు ఎందరో…
** నాని తప్పేంటి ? :  ఆళ్ల నాని యువకుడిగా ఉన్నప్పుడే రజక్ఖేయాల్లోకి వచ్చారు. మొదట ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నాని ఓడిపోయారు. తర్వాత జిల్లా రాజకీయాల్లో మాగంటి కుటుంబ హావ తగ్గించే క్రమంలో వై.ఎస్.రాజశేరరెడ్డి నాని ని ప్రోత్సహించి , కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 లో టికెట్ ఇచ్చి, దగ్గరుండి గెలిపించుకున్నారు. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2009 లోను నాని గెలిచారు. మరి ఏలూరు ప్రజలకు దశాబ్ద కాలంలో వారి జీవన స్థాయి పెంచే ఒక్క పరిశ్రమను ఆయనకు తీసుకురాలేకపోయారు. ప్రజల జీవన విధానం పెంచే ఇలాంటి కార్యక్రమం చేయలేకపోయారు.
** వన్ టౌన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజి అంటూ సగం సగం పనులు చేయించి అలాగే వదిలేసారు. మురుగు నీరు వెళ్లే దారి లేదు. కేవలం పక్కనున్న పంచాయితీలను స్వలాభం కోసం విలీనం చేసారు తప్పితే అక్కడ మౌలిక సదుపాయాలు కరవు.
** ఆళ్ల నాని తప్పేంటి ;   దాదాపు అన్ని నగరాలూ పెరుగుతున్నాయి. అవి విస్తరిస్తున్నాయి. ఏలూరు మాత్రం రాన్రాను కుంచించుకుపోతోంది. నాని వెనుక తిరిగే ఆయన స్నేహితులు, పార్టీ లీడర్లు రియల్ ఎస్టేట్ చేస్తూ వారు నిర్మించిన కాలనీలకు మాత్రం తగిన సౌకర్యాలు పొందుతుంటే మురికి వాడల్లో జనాభా ఏలూరులో పెరిగిపోతోంది. గత దశాబ్ద కాలంగా ఏలూరు లో మురికివాడలు ఎక్కువయ్యాయన్న విషయం పాపం ఆళ్ల నాని కి తెలియదేమో..

 

 

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!