చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని అల్లరి నరేష్ “మహర్షి” సినిమా తో ప్రేక్షకులను పలకరించి బాగానే అలరించాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన నటించిన అల్లరి నరేష్.. క్యారెక్టర్ బాగా ఎంటర్టైన్ చేయడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత డైరెక్టుగా హీరోగా అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ‘బంగారు బుల్లోడు’ సినిమా ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు తమని కించపరిచేలా ఉన్నట్లు స్వర్ణకార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ వృత్తిని అవమానించేలా ‘బంగారు బుల్లోడు’ సినిమా ట్రైలర్ వుందని మండిపడుతున్నారు.
అంతేకాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘాలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వెంటనే ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు అందజేశారు. ఒకరి బంగారు ఆభరణాలను వేరొకరి వేడుకలకి స్వర్ణకారులు ఇచ్చారని ట్రైలర్లో చూపించారని కానీ.. స్వర్ణకారులు ఎవరూ అలా చేయరని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అన్నారు. ఈ సీన్లు స్వర్ణకారులను కించపరిచేలా ఉన్నాయని స్పష్టంచేస్తున్నారు. దీంతో చాలా కాలం తర్వాత నరేష్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు రావడంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!