AllariNaresh – Nani: అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది సినిమా సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.. తాజాగా ఈ సినిమా చూసిన నాచురల్ స్టార్ నాని.. అల్లరి నరేష్ నటన పై కామెంట్ చేశారు.. తాజాగా నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..
విలక్షణ పాత్ర లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్న ఈ అల్లరోడు.. చాలా ఏళ్ళకు నాంది ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ తన ఖాతా లో వేసుకున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాల బాట పట్టింది. తాజాగా ఈ సినిమా చూసిన హీరో నాని ట్విట్టర్ లో కామెంట్స్ తెలిపారు.. ఇక నీ భవిష్యత్తు అంతా బంగారు బాటే అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి నాంది సినిమా చూశాను. రేయ్ రేయ్ రేయ్.. అల్లరి నరేష్ పేరు మార్చేసే.. ఇంకా అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. నీలో గొప్ప నటుడిని చూశాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇకపై ఇలాంటివి మీ నుంచి మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాని. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడం విశేషం.. నాని అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ అల్లరి నరేష్ నటనను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు..
Finally got to watch #Naandhi
రేయ్ రేయ్ రేయ్..@Allarinaresh పేరు మార్చేయ్ ఇంక
అల్లరి గతం
భవిష్యత్తుకి ఇది నాందిSuper happy for you ra .. hope to see you exploring the artist in you more and more here after ?
— Nani (@NameisNani) February 28, 2021
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!