NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీతో పొత్తు..నాకు సంబంధమే లేదు అంటున్న మోడీ.. తిరగబడ్డ బీజేపీ రాజకీయం..!!

వ‌చ్చే సార్వ‌త్రిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుకు.. మాన‌సికంగా, శారీర‌కంగా కూడా.. టీడీపీ రెడీ అయిపోయింది. వాస్త‌వానికి బీజేపీతో పొత్తు కార‌ణంగా ప్ర‌త్య‌క్షంగా టీడీపీ కొన్ని స్థానాలు కోల్పోవాల్సి ఉంటుంది. త‌మ‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను సైత‌.. క‌మ‌ల‌నాధుల‌కు కేటాయించాలి. ఇది ప్ర‌త్య‌క్ష న‌ష్టం. ఇక‌, ప‌రోక్షంగా బీజేపీ ఏమేర‌కు త‌మ్ముళ్ల‌కు చేయందిస్తుంది? ఏమేర‌కు వారితో క‌లిసి ప‌నిచేస్తుంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇది ఒక‌వైపు చ‌ర్చ‌గా మారింది.

మ‌రోవైపు.. ఈ పొత్తును ప్ర‌జ‌లు ఏమేర‌కు స్వీక‌రిస్తార‌నే చ‌ర్చ ఉండ‌నే ఉంది. ఇదిలావుంటే.. అస‌లు టీడీ పీతో పొత్తుపై బీజేపీలోనే రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన‌ట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ జాతీయ అధ్య క్షుడు, అగ్ర‌నేత అమిత్ షా వంటివారు టీడీపీని రాజ‌కీయ కోణంలో చూస్తున్నార‌నేది ఢిల్లీ వ‌ర్గాల వాద‌న‌. అంటే.. త‌మ అవ‌స‌రానికి వారు టీడీపీని వాడుకునే వ్యూహంలో ఉన్నారు. గ‌తంలో మ‌హారాష్ట్రలోనూ.. శిశ‌సేన‌ను వారు ఇలానే వాడుకున్నారు. త‌ర్వాత‌..ఏకంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఈ రేంజ్‌లో కాక‌పోయినా.. బీజేపీ స్థిర‌ప‌డేందుకు టీడీపీ వారికి తోడ్పాటు నందిస్తుంద‌ని క‌మ‌ల‌నాథులు విశ్వ‌సిస్తున్నారు. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ప్ర‌ధాని మోడీ.. ఈ విష‌యంలో విభేదిస్తున్నార‌న్న‌ది ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. పొత్తుకు ఆయ‌న వ్య‌తిర‌కం కాక‌పో యినా.. త‌మ‌ను న‌మ్ముకుని, ఇన్నాళ్లుగా తాము అడిగింది చేస్తున్న సీఎం జ‌గ‌న్ అంటే.. ప్ర‌ధాని వ్య‌క్తిగ‌తం గా మంచి అభిప్రాయం ఉంది. పాల‌న ప‌రంగా చేస్తున్న త‌ప్పుల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని అంటారు.

అలాగ‌ని.. పొత్తుల విష‌యంలో ఆయ‌న జోక్యం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అయితే.. టీడీపీ-జ‌న‌సేనల వ్య‌వ‌హారంలో పొత్తుపై మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌నే సూచ‌న‌లు చేశార‌ని, అందుకే ఈ పొత్తు వ్య‌వ‌హారం ఆల‌స్య‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. పైగా.. పొత్తు ఉన్నా..లేకున్నా.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌ధాని ఏపీలో \ప‌ర్య‌టించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నా.. ఏపీలో మాత్రం ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నారు. సో.. ఇవ‌న్నీ చూస్తే.. మోడీ వైఖ‌రి టీడీపీతోపొత్తు విష‌యంలో భిన్నంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju