Allu aravind – Aha: ఇప్పుడు తెలుగు ఓటీటీలలో టాప్ ప్లేస్‌లో ఉంది అల్లు అరవింద్ ఆహా. మంచి కంటెంట్‌తో అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. గత ఏడాది వరకు ఈ ఓటీటీల మీద జనాలకి అంత అవగాహన గానీ, ఆసక్తి గానీ లేదనే చెప్పాలి. ఎప్పుడైతే కరోనా దెబ్బకొట్టి థియేటర్స్ అన్నీ మూతపడ్డాయో..అప్పటి నుంచి ఓటీటీలపై జనాలకు విపరీతంగా ఆసక్తి పెరిగింది. తక్కువ ఖర్చుతో ఉన్నచోటే ఉండి నచ్చిన భాషలో నచ్చిన సినిమాను చూసేస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటిలలో కంటెంట్ బేస్డ్ సినిమాలు వెబ్ సిరీస్‌లు, షోలు బాగా పెరిగాయి. వాటికి ప్రేక్షకాధరణ కూడా బాగా పెరిగింది.
అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5 లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంస్‌లో హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు సౌత్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భషా చిత్రాలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూ జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. చిన్న బడ్జెట్ సినిమా నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కూడా దర్శక, నిర్మాతలు ఎవరు భారీ ఆఫర్ ఇస్తే స్ట్రీమింగ్ రైట్స్ వారికి ఇచ్చేస్తున్నారు. ఇక ఓటీటీలో వచ్చేవాటికి సెన్సార్ లేదు కాబట్టి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను వెబ్ సిరీస్‌లను ఎక్కువగా రూపొందిస్తున్నారు.
Allu aravind – Aha: సెలబ్రిటీ షోస్‌తో అందరినీ కలిపేస్తున్నారు అల్లు అరవింద్.
వీటికి పోటీగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆహా అనే తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాంను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే దీనీ అల్లు అరవింద్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. కానీ అంతగా పట్టించుకోలేదు. కరోనా సమయంలో థియేటర్స్ మూతపడిన తర్వాత ఆహా మీద ఆయన బాగా ఫోకస్ చేశారు. జెట్ స్పీడ్ లో ఆహాను జనాలలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌లోని అందరికీ ఆహా ఆకర్షణీయంగా మారింది. కంటిన్యూస్‌గా షోస్, వెబ్ సిరీస్ అలాగే ఓటీటీ మూవీస్, థియేట్రికల్ రిలీజైన సినిమాలను ఆహాలో తీసుకు వస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!