Samantha : సమంత నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ఈ సినిమా సమంత కెరీర్లోనే చాలా ప్రత్యేకమైన సినిమా. మొదటి సినిమా ఏ మాయ చేశావే నుంచి గత చిత్రం జానూ వరకు శాకుంతలం లాంటి సినిమా తన కెరీర్లో ఇప్పటి వరకు చేయకపోవడం విశేషం. అందుకే ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇవ్వడమే కాదు తన శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ సినిమా పూర్తి చేసేంత వరకు మరే కొత్త ప్రాజెక్ట్‌ని సమంత కమిటవదలచుకోలేదు. అందుకే శాకుంతలం మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ తనయ చిన్నారి అర్హ ఇందులో భరత పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేశారు. గ్రాండ్‌గా అర్హాకి సెండాఫ్ కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే శాకుంతలం సినిమా షూటింగ్ ఏ రేంజ్లో షూటింగ్ పూర్తి చేస్తున్నారో అర్థమవుతోంది. కాగా ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. మాహాభారతంలో ని ఆదిపర్వం ఆధారంగా శకుంతల – దుష్యంతుల ప్రేమ గాధను గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు.
Samantha : గుణశేఖర్ నుంచి వస్తున్న శాకుంతలం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
పాన్ ఇండియా సినిమాగా అన్నీ సౌత్ భాషలలో రిలీజ్ చేయనున్న శాకుంతలం సినిమాను గుణశేఖర్ తనయ నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో రూపొందుతోంది. ఇక ఈ సినిమాను 2022 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గుణశేఖర్ అంటే ప్రత్యేకమైన సెట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాగే శాకుంతలం సినిమాకి ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ చాలా హైలెట్‌గా ఉండనున్నాయట. చూడాలి మరి రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ నుంచి వస్తున్న శాకుంతలం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.