Allu Arjun : అల్లు అర్జున్ కార్ వాన్ ని ఢీ కొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ముప్పు.. రంపచోడవరం అడవుల్లో పుష్ప షూటింగ్ ముగించుకొని ఈరోజు వస్తుండగా ఇలా జరిగింది. ఆయన కార్ వాన్ ని వెనక నుండి వస్తున్న కంటెయినర్ ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. అదృష్టం ఏమిటంటే.. అందులో బన్నీ లేడు దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ఏపీలోని రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. అప్పటికే బన్నీ షూటింగ్ ముగించుకుని కారులో వెళ్లారని సమాచారం. ఎంతో ప్రేమగా కొనుక్కున్న ఈ కార్ వాన్ కి ఫాల్కన్ అనే పేరు పెట్టాడు.. అల్లు అర్జున్ కార్ వాన్ ఖరీదుు రూ. 7 కోట్లు.. పుష్ప సినిమా ఆగస్టు 13న రిలీజ్ చేసామని ఇప్పటికే మైత్రి మూవీస్ ప్రకటించింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
Allu Arjun : Allu Arjun carvane accident