బన్నీ ‘క్యారవాన్’ ఖరీదు ఎంతో తెలుసా?

Share

హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తెరపైనే కాదు నిజ జీవితంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఖరీదైన వస్తువులు, ఖరీదైన కార్ల కొనుగోళ్ల విషయంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు.

అల్లు అర్జున్ ‘క్యారవాన్’ అత్యంత ఖరీదుతో రూపొందించారు. ఈ ‘క్యారవాన్’ ఫోటోను బన్ని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. బ్లాక్ కలర్‌లో ఈ ‘క్యారవాన్’ రూపొందించారు. ఈ ‘క్యారవాన్‌’పై ఆయన పేరుకు తగినట్లుగా ‘ఎఎ’ అని ఇంగ్లీషులో అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ ‘క్యారవాన్’ ఖరీదు సుమారు ఏడు కోట్ల రూపాయలు కాగా ఇంటీరియల్ డిజైన్ కోసమే సుమారు మూడున్నర కోట్లు ఖర్చు చేశారు. విలాసవంతమైన సకల సౌకర్యాలు ఈ ‘క్యారవాన్‌’లో ఉన్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెట్టింగ్ వద్దకు వస్తున్న బన్ని అభిమానులు ఈ ‘క్యారవాన్‌’ను ఆసక్తిగా పరిశీలిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు.


Share

Related posts

Vimala Raman Blue Saree Photos

Gallery Desk

NTR: ఉక్రెయిన్ కి వెళ్తున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్..??

sekhar

Corona Vaccine Good News: కరోనా వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

somaraju sharma

Leave a Comment