Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ లో ఒక డైలాగ్ ఉంటుంది. “నేను ఇక్కడికి వేలెట్టి గెలకడానికి రాలేదు… ఏలడానికి వచ్చాను” అని ఒక సందర్భంలో అంటాడు. చూస్తుంటే అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించేలాగే కనిపిస్తున్నాడు. గత పదేళ్ల నుండి ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా వెలుగొందుతున్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లను బన్నీ ఎంతో చాకచక్యంగా అధిగమించాడు అని రికార్డులు చెబుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే…
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా యాభై కోట్ల రూపాయల మార్క్ ను సులువుగా అధిగమిస్తాయి. వీరిద్దరి అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా మొదటి వారంలో మంచి వసూళ్లు రాబట్టడం అందుకు కారణం. అయితే అల్లుఅర్జున్ వరుసగా నటించిన ఆరు సినిమాలు 50 కోట్ల మార్క్ ను దాటడం గమనార్హం. రేసుగుర్రం నుండి పుష్ప ముందు వరకూ అతను నటించిన ప్రతి చిత్రం 50 కోట్ల మార్కును దాటింది.
ఇక వందకోట్ల క్లబ్ విషయానికి వస్తే మహేష్ బాబు సంక్రాంతి సినిమా సరిలేరు నీకెవ్వరు తో మొదటిసారి ఆ క్లబ్ లో చేరాడు. ఇప్పుడు భీమ్లా నాయక్ తో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ ఘనత సాధిస్తాడు. అయితే అల్లు అర్జున్ అల వైకుంఠ పురం సినిమా తో నాన్ బాహుబలి రికార్డును ఎప్పుడో తన పేరు మీద లిఖించుకోగా పుష్ప సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మరి మహేష్, పవన్ లకు వంద కోట్ల సినిమా ఒకటి ఉంటే అల్లు అర్జున్ కు రెండు ఉన్నాయి. పుష్ప రెండో భాగం కూడా ఈ మార్కును అవలీలగా దాటేలాగే కనిపిస్తుంది. కాబట్టి ఇండస్ట్రీలో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు కొల్లగొట్టగలిగే స్టార్ లు ఇక నుండి ముగ్గురు అని చెప్పుకోవాలేమో..!