Allu Arjun: గత సంవత్సరం ‘అల వైకుంఠ పురంములో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బన్నీ ఇపుడు మళ్ళి పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబో లో రెండు చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా మీద బన్నీ ఫాన్స్ కి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
అయితే ఈ చిత్ర సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందట. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా లో లారీ క్లీనర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ గా కనిపించడానికి చాలా కష్టపడుతున్నాడట. ఆ పాత్రకు సరిపోయే విధంగా తన బాడీ లాంగ్వేజ్ ని కూడా మార్చుకుంటున్నాడట.
అయితే అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర కోసం ఒక రోజు మేకప్ వేసుకోవడానికి సుమారు రెండు గంటలు వెచ్చించాలిసి వస్తుందట. మరియు ఆ మేకప్ ని తియ్యడానికి మరో గంటన్నర్ర సమయం పడుతుందట. అంటే బన్నీ కి ఆ మేకప్ కోసమే ఏకంగా మూడున్నర్ర గంటలు పడుతుందట. బన్నీ అచ్చం లారీ డ్రైవర్ లాగా కనిపించడానికి మేకప్ మెన్స్ చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా అది దేశ వ్యాప్తంగా ఉన్న బన్నీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది బన్నీ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం వలన బన్నీ మరింత కష్టపడుతున్నట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.