సమంత అడిగితే కాదనకుండా ఆహా షో లో సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన అల్లు అర్జున్ ..?

Share

సమంత ప్రస్తుతం అల్లు అరవింద్ ఆహా కోసం సాం జాం అన్న టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సమంత సాం జాం టాక్ షో కి హోస్ట్ గా చేస్తోందనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సమంత ఈ టాక్ షోని సక్సస్ ఫుల్ గా నడిపిస్తోంది. అందరూ సినిమా సెలబ్రిటీస్ కావడం తో సమంత కి వాళ్లని ఇంటర్వ్యూ చేయడం .. తద్వారా ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేయడం చాలా ఈజీ అవుతోంది. ఇప్పటికే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి పలువురు సినీ స్టార్స్ ని ఈ షో ద్వారా ఇంటర్వ్యూ చేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలని బయటకి చెప్పిస్తోంది.

Sam Jam': Samantha to interview Chiru, Bunny, Vijay for Aha's show

కాగా త్వరలో ఆహా లో సమంత.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ – సమంత కలిసి సన్నాఫ్ సత్య మూర్తి సినిమా చేశారు. కాబట్టి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దాంతో సమంత .. చాలా విషయాలని బయట పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను సమంత చెప్పించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

Allu Arjun in Sam Jam Show | Promo | Samantha Akkineni | AA | An aha Original | #SamJamWithALLUARJUN - YouTube

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రికరణ సాగుతోందట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 5 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయాలని సమంత ఆహా షో లో అల్లు అర్జున్ ని అడిగి సమాధానం రాబట్టిందని అంటున్నారు. మరి ఇదే నిజమైతే ఇన్నాళ్ళు పుష్ప సినిమా కి సంబంధించి వస్తున్న వార్తల్లో కొన్ని విషయాలకి సీక్రెట్స్ రివీల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ 2021 జనవరి 1 న ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కాబోతోంది.


Share

Related posts

కళ్ళను, చర్మాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారా..! అయితే ఇది చదవక తప్పదు..!!

Special Bureau

Mask: మాస్క్ ఫ్రీ జాబితాలోకి రెండో దేశం..!!

sekhar

Mahesh Babu: మహేష్ బాబు విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ సినిమా..??

sekhar