తగ్గేదే లే అంటూ వచ్చిన పుష్ప సినిమా తెలుగు వారినే కాదు, బాలీవుడ్లో ప్రేక్షకులనూ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్నీ మాస్ క్యారెక్టర్, సుకుమార్ కథాకథనం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వేరే రేంజ్ లో ఉన్నాయి. ‘పుష్పరాజ్’ క్యారెక్టర్ ఒక ట్రెండ్ సెట్ చేయాలని బన్నీ ప్రత్యేకంగా సరికొత్త మేనరిజాన్ని అలవర్చుకున్నాడు. చిత్తూరు యాసతో అతడు ప్రతి డైలాగ్ ను అద్భుతంగా మలిచాడు. అంతేకాదు, ఒక భుజంపైకెత్తి నడుస్తూ భలే అట్రాక్టివ్‌గా కనిపించాడు. తాజా ఇంటర్వ్యూలో పుష్పరాజ్ పాత్ర గురించి, అలానే సిగ్నేచర్ వాక్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
సిగ్నేచర్ వాక్ అలా పుట్టిందే
పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయకముందే “పుష్ప 3” కి సుకుమార్ సంచలన ప్లాన్..??
ఈ సిగ్నేచర్ వాక్ కి ప్రాణం పోసింది దర్శకుడు సుకుమార్యేనని బన్నీ చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ… “పుష్ప మూవీ ప్రారంభించే ముందు ఒకరోజు సుకుమార్ నన్ను కలిశాడు. ‘నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం కానీ ఈ మూవీలో నీ వాకింగ్ స్టైల్ ఒక ట్రెండ్‌గా నిలిచిపోవాలి. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ వాకింగ్ స్టైల్యే ఫాలో ఎంత గొప్పగా ఉండాలి’ అన్నారు. అప్పుడు నేను కాసేపు ఆలోచించాను. తర్వాత భుజం పైకి ఎత్తి వాక్ చేసే ఒక స్టైల్ సుక్కుకి చూపించాను. ఆశ్చర్యంగా అది తనకి నచ్చేసింది. దాంతో సినిమాలో కూడా ఇదే ఫాలో అయిపోయాను. ఈ వాకింగ్ యంగ్‌స్టర్స్‌లో ఇంతలా ట్రెండ్ అవుతుందని అస్సలు ఊహించలేదు” అని చెప్పుకొచ్చాడు.
ఒక్క వాకింగ్ స్టైల్ మాత్రమే కాదు
పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ఒక్క వాకింగ్ స్టైల్ మాత్రమే కారణం కాదని చాలా కారణాలు ఉన్నాయని అల్లు అర్జున్ అన్నాడు. తక్కువ అంచనాలతోనే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.350కోట్లకు కలెక్టర్ చేయగలిగింది. బాలీవుడ్ లో ఎవరూ ఊహించని విధంగా రూ.110 కోట్ల వసూలు చేసి సత్తా చాటింది. దీనికి కొనసాగింపుగా రెండవ భాగం ‘పుష్ప: ది రూల్’ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి విజయ్ సేతుపతిని సినిమాలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.