Allu arjun: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. చాలాసార్లు బన్నీ అర్హా కి సంబంధించిన క్యూట్ వీడియోలు చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటికి నెటిజన్ల నుండి అదేరీతిలో అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తూ ఉంటది. అప్పట్లో “అలా వైకుంఠపురం లో” సినిమా రాకముందు.. రాములో రాముల సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు దోశ స్టెప్ లు అంటూ… జోక్ చేయడం.. అప్పట్లో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఇటీవల పుట్టినరోజు సమయంలో కూడా అర్హా చాలా క్యూట్ గా ఉన్న వీడియో రిలీజ్ కావటం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో బేబీ షామిలి మాదిరిగా .. అల్లు అర్జున్ కూతురు కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమెను పిల్లల సినిమాకి సంబంధించి లీడ్ రోల్ లో చూపించి ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేయటం కోసం ఇండస్ట్రీ టాప్ నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read more: Allu arjun : అల్లు అర్జున్ సినిమా చేయనున్న ధనుష్ నిర్మాతలు
పిల్లల సినిమా ఈ సినిమాని.. నిర్మించాలని కొత్త డైరెక్టర్ నీ పరిచయం చేయాలని దిల్ రాజు అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబంధించి దిల్ రాజు …బన్నీతో అదే రీతిలో బన్నీ భార్య స్నేహారెడ్డితో చర్చలు జరిపినట్లు వారి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు స్క్రిప్టు ఓకే చేసే పనిలో దిల్ రాజు ఉన్నట్లు సమాచారం.