Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే కి అభిమానులు అదిరిపోయే సర్ప్రైజ్..!!

Share

Allu Arjun : ఈ నెల 8 వ తారీఖున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేపథ్యంలో అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక దక్షిణాది సినిమా రంగంలో చాలా రాష్ట్రాలలో అల్లు అర్జున్ కి అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎనిమిదో తారీకు బన్నీ 38వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. దాదాపు వంద రకాల సామాజిక సేవలు ప్రజలకు అందించాలని బన్నీ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు.

Allu Arjun's birthday surprise for fans
Allu Arjun’s birthday surprise for fans

చాలా వినూత్నంగా ఈసారి అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలు చేయాలని.. అభిమానులు సరికొత్తగా ఆలోచన చేశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో .. ప్రజలకు భారీ ఎత్తున మాస్కులు అందించటం మరియు శానిటైజర్ బాటిల్స్ ఇవ్వటం ఇంకా కొత్తగా మరిన్ని కార్యక్రమాలు చేసే ఆలోచనలో బన్నీ అభిమానులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే రేపు సాయంత్రం ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప సినిమాకి సంబంధించి సరికొత్త సర్ప్రైజ్ అవ్వటానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో డబ్బింగ్ చెప్పడానికి బన్నీ తాజాగా ఆ వీడియో కి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమాగా పుష్ప ద్వారా బన్నీ అనేక భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. 


Share

Related posts

పూరి జగన్నాధ్ – బాలయ్య కాంబోలో వచ్చేది చారిత్రాత్మకమా .. పూరి రాసిన 7 కథల్లో ” గోన గన్నారెడ్డి ” ..?

GRK

మెగాస్టార్ చిరంజీవి సోదరి ఎవరో తెలుసా?

Teja

కాంగ్రెస్‌తో చెలిమి చేస్తే ‘చెల్లే’: రాజ్‌నాధ్

somaraju sharma