YS Jagan: సీఎం జగన్ రాజు అంటూ అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సినిమా టికెట్ల వ్యవహారం ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నరీతిలో వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. “రిపబ్లిక్” మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో.. పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడటంతో.. పాటు మంత్రులను సనాసులు అన్ని విమర్శించడంతో.. సినిమా టికెట్ల వ్యవహారం కాంట్రవర్షియల్ గా మారింది. పవన్ సినిమా వేడుకకు వెళ్లి రాజకీయ కామెంట్లు చేయడం.. దారుణమని ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వైసీపీ నేతలు పవన్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు. మరోపక్క సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలే .ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని ఎప్పటినుండో తీసుకురావాలని  కోరుతున్నట్లు.. వైసీపీ మంత్రులు చెప్పుకొచ్చారు.

 

allu-arvinds-sensational-remarks-that-cm-jagan-is-king
allu-arvinds-sensational-remarks-that-cm-jagan-is-king

 సీఎం జగన్ రాజు అల్లు అరవింద్ పొగడ్తల వర్షం..

ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు వైసీపీ మంత్రి పేర్ని నాని తో సమావేశమైన సమయంలో.. ఇండస్ట్రీ టాప్ నిర్మాతలు దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని… గతంలో సీఎం తో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు సమావేశమైన సమయంలో ఈ విధానాన్ని కోరినట్లు… పేర్ని నాని తో మీటింగ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీ టాప్ నిర్మాతలలో ఒకరు.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తాజాగా సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అక్కినేని అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకలో… అల్లు అరవింద్ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ…రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా?… అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దయచేసి అర్థం చేసుకోండి.. వేసులు బాటు కలిగించే రీతిలో కలిగించే రీతిలో ఆలోచన చేయాలని.. ముఖ్యమంత్రి జగన్ అర్థం చేసుకోవాలని విన్నవించుకున్నారు.

మనల్ని చూసి బాలీవుడ్ కూడా ఫాలో అవుతోంది..

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ ఫంక్షన్ తర్వాత… ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందని, ఆ తర్వాత సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయటం జరిగింది, అది ప్రేక్షకుల వలనే అని.. పొగిడారు. ఇక్కడ సినిమాలు విడుదల చేయడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మనలను చూసి సినిమాలు విడుదల చేస్తున్నారని.. స్పష్టం చేశారు. ఇండస్ట్రీ ప్రస్తుతం అనేక సమస్యలలో ఉందని ఈ విషయంలో పరిష్కారం చూపాలని…ప్రభుత్వాన్ని కోరారు. సానుకూలంగా  ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అల్లు అరవింద్ తన మెసేజ్ లో.. ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. సినిమా ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదని చాలా మంది తెలపడం జరిగింది.

Most Eligible Bachelor release pushed until October, due to Coronavirus Pandemic | Telugu Movie News - Times of India

 మెగాస్టార్ చిరంజీవి ఫోన్

వైసీపీ మంత్రి పేర్ని నాని కి మెగాస్టార్ చిరంజీవి కూడా ఫోన్ చేసి పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇటువంటి తరుణంలో.. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఉండే అల్లు అరవింద్ కూడా ఏపీ ప్రభుత్వానికి సానుకూలంగా… మాట్లాడటం తో.. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విషయంలో పవన్.. ఏకాకి అయిపోయినట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా “రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో… పవన్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. చేసిన వ్యాఖ్యలు.. చివరాఖరికి ఇండస్ట్రీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి అని చాలామంది సినీ పెద్దలు అంటున్నారు. 


Share

Related posts

HBD Manisharma: మణిశర్మ బర్త్ డే స్పెషల్ నారప్ప సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల..!!

bharani jella

రాజమౌళి ఒక్క మాట చెప్పాడో లేదో ఆలియా బ్లైండ్ గా డిసైడైపోయింది.. ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు ..!

GRK

పృద్వి అధికారాలకు కత్తెర!?

somaraju sharma